ఏపీ క్యాపిటల్ రీజియన్ అథారిటీ (ఏపీసీఆర్డీఏ) నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా ఎన్విరాన్ మెంటల్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండు పోస్టులు ఖాళీలు ఉండగా... వీటిని కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎన్విరాన్ మెంటల్ సైన్స్ లేదా ఎన్విరాన్ మెంటర్ ఇంజినీరింగ్ లో లో పీజీ చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంబంధింత విభాగంలో 10 ఏళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు ఎంఎస్ ఆఫీస్ పై మంచి అవగాహన ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఎంపికైన అభ్యర్థులు విజయవాడలోని ఏపీ సీఆర్డీఏ పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏడాది కాలానికి రిక్రూట్ చేసుకుంటారు. పనితీరును బట్టి మూడేళ్లకు రెన్యూవల్ చేస్తారు. https://crda.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆఫ్ లైన్ విధానంలో అనుమతించరు. మే 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏపీసీఆర్డీఏ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. కెరీర్ సెక్షన్ లోకి వెళ్లి సంబంధింత నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
అప్లికేషన్ ప్రాసెస్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే 7288877952 నెంబర్ ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా recruitment@apcrda.org కు మెయిల్ చేయవచ్చు.