డీఎడ్‌‌ సెట్‌ 2025 దరఖాస్తు గడువు మే 20వరకు పొడిగింపు.. జూన్‌ 2,3 తేదీల్లో ప్రవేశ పరీక్ష-application deadline for d ed extended to may 20 entrance exam on june 2 3 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  డీఎడ్‌‌ సెట్‌ 2025 దరఖాస్తు గడువు మే 20వరకు పొడిగింపు.. జూన్‌ 2,3 తేదీల్లో ప్రవేశ పరీక్ష

డీఎడ్‌‌ సెట్‌ 2025 దరఖాస్తు గడువు మే 20వరకు పొడిగింపు.. జూన్‌ 2,3 తేదీల్లో ప్రవేశ పరీక్ష

Sarath Chandra.B HT Telugu

ఆంధ్రప్రదేశ్‌‌లో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2025 దరఖాస్తుల స్వీకరణ గడువును మే 20వ తేదీ వరకు పొడిగించారు. జూన్‌ 2,3 తేదీల్లో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ పరీక్షను నిర్వహిస్తారు.

ఏపీ డీఈఈ సెట్‌ 2025 దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌‌లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు దరఖాస్తు గడువును పొడిగించారు.

ఏపీ డిఈఈ సెట్‌ 2025 దరఖాస్తు గడువును మే 20వ తేదీ వరకు పొడిగించినట్టు కన్వీనర్ ప్రకటించారు. దరఖాస్తుల గడువు మే 8వ తేదీతో ముగియగా మే 20వరకు దానిని పొడిగించారు.

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ వివరాల కోసం ఈ లింకులను అనుసరించండి.

https://cse.ap.gov.in లేదా https://apdeecet.apcfss.in

ఏపీ డీఈఈ సెట్‌ దరఖాస్తులను ఏప్రిల్ 22 నుంచి మే 8 వరకు స్వీకరించారు. దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో మే 20వ తేదీ వరకు గడువును పొడిగించారు.

డీఈఈ సెట్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

డిఎడ్‌ సెట్‌ 2025కు అర్హతలు

డిఈఈ సెట్‌ 2025కు హాజరయ్యే అభ‌్యర్థులు డీఈఈ సెట్‌ ర్యాంకులతో పాటు కనీస విద్యార్హతలు కలిగి ఉండాలి.

ఇంటర్మీడియట్‌ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు దరఖాస్తు చేయొచ్చు. అడ్మిషన్ పొందే సమయానికి ఇంటర్‌లో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది.

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సులో 25శాతం సీట్లను మ్యాథ్స్‌, 25 శాతం ఫిజిక్స్‌, 25 శాతం బయాలజీ, 25శాతం సోషల్ సబ్జెక్టులకు కేటాయిస్తారు.

దరఖాస్తు చేసే అభ్యర్థులు సెప్టెంబర్ 1 నాటికి 17ఏళ్లు పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయో పరిమితి లేదు.

ప్రవేశ పరీక్ష ఇలా...

డిఈఈ సెట్‌ 2025 పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్‌ ఏలో ఇందులో టీచింగ్ ఆప్టిట్యూడ్‌, జనరల్ నాలెడ్జ్‌, ఇంగ్లీష్‌, తెలుగు, ఆప్షనల్ లాంగ్వేజ్‌, మ్యాథ్స్‌, జనరల్ సైన్స్‌, సోషల్ స్టడీస్‌ సబ్జెక్టుల్లో 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌ బిలో మ్యాథ్స్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్‌ లో 40 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

ఫిజిక్స్‌లో 20 మార్కులు, కెమిస్ట్రీలో 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. బయాలజీలో బోటనీలో 20 మార్కులు, జువాలజీలో 20 మార్కులు ఉంటాయి. సోషల్ స్టడీస్‌లో హిస్టరీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్మీడియట్ సిలబస్‌ నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఒకేషనల్‌ అభ్యర్థులు అర్హులు కాదు..

ఇంటర్మీడియట్ ఒకేషనల్‌ కోర్సులు ఉత్తీర్ణులైన వారు డిఇడి కోర్సుకు అర్హులు కాదు. సబ్జెక్టుల వారీగా ఇంటర్‌లో కోర్సులకు అనుగుణంగా డిఇడి ఆప్షనల్స్‌ ఎంచుకోవచ్చు.

డిఇఇ సెట్‌ 2025 హాల్‌ టిక్కెట్లను మే 20వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్‌ టిక్కెట్లను డౌన్‌ లోడ్ చేసుకోవడంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే 79958 69743 నంబరును సంప్రదించాల్సి ఉంటుంది. డూప్లికేట్‌ హాల్‌ టిక్కెట్లను జారీ చేయరు.

డిఇఇ సెట్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థులకు రూ.750 ఫీజు చెల్లించిన తర్వాత ఆన్‌లైన్‌లో జర్నల్ నంబర్ జారీ జనరేట్ అవుతుంది. ఆన్‌లైన్‌ జర్నల్‌ నంబరుతో దరఖాస్తును కొనసాగించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించడానికి మాత్రమే ఆన్‌లైన్ జర్నల్ ధృవీకరణగా పరిగణిస్తారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.