ఏపీ స్త్రీ నిధిలో 170 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే-ap stree nidhi credit cooperative federation releases notification for 170 assistant manager posts ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ స్త్రీ నిధిలో 170 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే

ఏపీ స్త్రీ నిధిలో 170 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే

ఏపీ స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జూలై 18వ తేదీ వరకు ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఏపీ స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాలు

ఏపీ స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒక ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ పేర్కొన్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఏదైనా డిగ్రీని అర్హతగా నిర్ణయించారు. జూలై 7వ తేదీ అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.జూలై 18వ తేదీ వరకు గడువు ఉంటుంది. https://www.sthreenidhi.ap.gov.in వెబ్ సైట్ లోకి పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ స్త్రీ నిధిలో ఉద్యోగాలు - ముఖ్య వివరాలు

  • ఉద్యోగ నోటిఫికేషన్ - స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్, ఏపీ ప్రభుత్వం.
  • మొత్తం ఖాళీలు - 170
  • ఉద్యోగాలు - అసిస్టెంట్ మేనేజర్ కేడర్
  • కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారు.
  • అర్హతలు - ఏదైనా డిగ్రీ
  • 01.06.2025 నాటికి 42 ఏళ్లు దాటకూడదు.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులు ప్రారంభం - 7 జూలై 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ - 18 జూలై 2025
  • దరఖాస్తు ఫీజు - రూ. 1000
  • నెలకు జీతం - రూ. 25, 520తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
  • ఎంపిక విధానం - ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… షార్ట్ లిస్ట్ (1:4 నిష్పత్తిలో) ఇస్తారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
  • మొత్తం 100 మార్కులకు ప్రతిపాదికన మెరిట్ లిస్టులను తయారు చేస్తారు. పదో తరగతి మార్కుల నుంచి పని చేసిన అనుభవం వరకు మార్కులను కేటాయిస్తారు. ఈ వివరాలను పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో చూడొచ్చు.
  • అధికారిక వెబ్ సైట్ - https://www.sthreenidhi.ap.gov.in

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.