AP Staff Nurse Posts : ఏపీ వైద్య, ఆరోగ్యశాఖలో 266 స్టాఫ్ నర్స్ పోస్టులు, దరఖాస్తు దాఖలకు గడువు ఎప్పుడంటే?
AP Staff Nurse Posts : ఏపీలో వైద్యారోగ్య శాఖలో 266 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 15వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నారు.
AP Staff Nurse Posts : ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖలో 266 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలకు గడువును జనవరి 15గా నిర్ణయించారు. దరఖాస్తులను ఆయా మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం డైరెక్టర్ డాక్టర్ కె. పద్మావతి తెలిపారు. అయితే ఈ పోస్టులకు ఆయా జోన్ వారీగా రీజనల్ డైరెక్టర్లు ప్రకటన విడుదల చేస్తారని పేర్కొన్నారు.
అర్హతలు
జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి
అభ్యర్థుల వయస్సు 2024 జులై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్స్‌కు మూడేళ్లు, దివ్యాంగులైన అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. గరిష్టంగా 52 ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్ ఫీజు
ఓసీ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగు, ఎక్స్‌సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.500 ఉంటుంది. అప్లికేషన్ ఫీజును రీజినల్ డైరెకర్ట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ పేరుతో ఆయా జోన్‌లను యాడ్ చేసి డీడీ తీయాల్సి ఉంటుంది.
షెడ్యూల్
1. దరఖాస్తు దాఖలకు జనవరి 15 ఆఖరు తేదీ
2. జనవరి 17 నుంచి 23 వరకు దరఖాస్తులను పరిశీలన చేస్తారు.
3. జనవరి 24న మెరిట్ జాబితాను ప్రచురిస్తారు. ఆ జాబితాపై అభ్యంతరాలను కోరుతారు.
4. జనవరి 27 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
5. జనవరి 29న తుది మెరిట్ జాబితాను ప్రచురిస్తారు.
6. జనవరి 30, 31 తేదీల్లో కౌన్సింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తారు.
ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ?
జోన్ -I : 72 పోస్టులు (పాలకొండ-8, నర్సన్నపేట-1, టెక్కలి-14, రాజాం-3, పొందురు-1, సీతంపేట-7, హరిపురం-2, చీపురపల్లి-12, సాలూరు-1, భద్రగిరి-3, నర్సీపట్నం-1, అనకాపల్లి-15, కోటఊరట్ల-1, చింతపల్లి-2, ముంచిగ్‌పుట్-1)
జోన్-II : 68 పోస్టులు (అమలాపురం-2, రామచంద్రాపురం-3, కొత్తపేట-2, రంపచోడవరం-1, పెద్దాపురం-1, తుని-3, అనపర్తి-19, తాళ్లరేవు-1, జగ్గంపేట-1, ఏలేశ్వరం-1, రౌతులపుడి-1, ఆలమూరు-1, టి.కొత్తపల్లి-1, కొవ్వూరు-1, చింతూరు-1, తణుకు-1, పాలకొల్లు-1, చింతలపూడి-1, భీమవరం-1, జంగారెడ్డి గూడెం-11, భీమడోలు-1, నిడదవోలు-3, పోలవరం-1, నందిగామ-2, తిరువూరు-1, గుడివాడ-1, జగ్గయ్యపేట-1, ఎస్‌కె రాజ-2, పామర్రు-1)
జోన్ III : 44 పోస్టులు (తెనాలి-6, బాపట్ల-10, నరసరావుపేట-24, గురజాల-1, కందుకూరు-1, ఆత్మకూరు-1, రాపూరు-1)
జోన్ IV : 82 (బనగానపల్లి-7, థోన్-4, పత్తికొండ-2, కొయిల్‌కుంట్ల -1, ఆళ్లగడ్డ-1, ఆత్మకూరు -1, ఓర్వకల్లు-2, మైదుకూరు-1, రాయదుర్గం-9, కదిరి-4, హిందుపూర్-11, ధర్మవరం-2, తాడిపత్రి-5, గుంతకల్లు-10, నలమడ-1, రాయచోటి-1, ప్రొద్దుటూరు-3, రాజంపేట-3, జమ్మలమడుగు-1, పోరుమమిల్ల-1, కమలాపురం-2, చెన్నూరు-1, సిద్ధౌత్-1, కుప్పం-3, పుంగనూరు-1, శ్రీకాళహస్తి-1, సోడుం-1, నగిరి-2)
ఎంపిక ప్రక్రియ
స్టాఫ్ నర్సు పోస్టులను మార్కులు ఆధారంగానే భర్తీ చేస్తారు. విద్యా అర్హతలోని సబ్జెక్టుల్లో మార్కులకు 75 శాతం మార్కులు, అనుభవానికి 15 శాతం మార్కులు కేటాయిస్తారు. కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏడాది ఒక మార్కు కేటాయిస్తారు. అలా గరిష్ఠంగా 10 శాతం మార్కులు కేటాయిస్తారు.
అనుభవానికి సంబంధించి మార్కులను కూడా గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు. పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు ఒక మార్కు కేటాయిస్తారు.
దరఖాస్తును ఇలా చేసుకోండి?
దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ https://cfw.ap.nic.in/ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాన్ని పూర్తి చేసి సంబంధిత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటిస్టెడ్ చేయాలి. వాటిని దరఖాస్తు జత చేసి మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి జోన్-2కి సంబంధించిన అప్లికేషన్ https://cfw.ap.nic.in/pdf/Staff%20Nurse%20Recruitment%20Notification%2001-2025.pdf వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. మిగతా జోన్ అప్లికేషన్లు కూడా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు