ఏపీ పదోతరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి-ap ssc supplementary hall tickets 2025 out direct download link ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ పదోతరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

ఏపీ పదోతరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

ఏపీ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు నేరుగా అధికారిక వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే పాఠశాలల లాగిన్ ద్వారా హెడ్ మాస్టర్లు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేయవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందవచ్చు.

ఏపీ పదోతరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల

ఏపీ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లేదా వాట్సాప్ మన మిత్ర లేదా స్కూళ్ల లాగిన్ల ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మే 19 నుంచి మే 28 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల చేశారు. రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థుల హాల్ టికెట్లు విడుదల చేశారు.

ఈ హాల్ టికెట్లను సంబంధిత పాఠశాల హెడ్‌ మాస్టర్లు తమ స్కూల్ కోడ్, పాస్‌వర్డ్ ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌ www.bse.ap.gov.in ద్వారా విద్యార్థుల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేయవచ్చు.

విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

  1. విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
  2. విద్యార్థులు https://bse.ap.gov.in/ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. హోంపేజీలో ఎస్ఎస్సీ ఏఎస్ఈ హాల్ టికెట్లు మే 2025 లింక్ పై క్లిక్ చేయండి.
  4. ఆ తర్వాత పేజీలో జిల్లా, స్కూల్ పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేది వంటి వివరాలు ఎంచుకుని హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మన మిత్ర వాట్సాప్ ద్వారా

ఏపీ ప్రభుత్వ వాట్సాప్ నెంబర్ 9552300009 కు Hi అని మెసేజ్ పెట్టాలి. అందులో "Educational Services" ఎంపిక చేసి పదో తరగతి సప్లిమెంటరీ హాల్‌టికెట్‌ను పొందవచ్చు.

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్

  • మే 19- ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్-1
  • మే 20- సెకండ్‌ లాంగ్వేజ్‌
  • మే 21- ఇంగ్లీష్
  • మే 22- మ్యాథ్స్
  • మే 23- భౌతికశాస్త్రం
  • మే 24- జీవశాస్త్రం
  • మే 26- సామాజిక అధ్యయనాలు
  • మే 27- ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్-2, OSSC మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్-1
  • మే 28- OSSC మెయిన్‌ లాంగ్వేజ్ పేపర్-2, OSSC ఒకేషనల్‌ కోర్సు

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం