ఏపీ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ - 2025 ఫలితాలు వచ్చేశాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు పదో తరగతి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సులభంగా తెలుసుకోవచ్చు.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 1,23,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 76.14 శాతం మంది ఉత్తీర్ణులైయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 73.55గా నమోదు కాగా.. బాలికలది 80.10 శాతం ఉత్తీర్ణత ఉంది. 98.24 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా టాప్ ప్లేస్ లో ఉండగా…. పశ్చిమ గోదావరి జిల్లా 50.24 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.
టెన్త్ విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలు కింది విధంగా ఉంటాయి….
Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.
Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.
Step 3 : 'SSC ASE May 2025 Result- 2025' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : మార్కుల మెమో పొందడానికి మీ 'హాల్ టికెట్' నెంబర్‌ను నమోదు చేయాలి.
Step 5 : పీడీఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి.