తెలుగు న్యూస్ / career /
AP SSC Exams 2025 : ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు - పకడ్బందీ ఏర్పాట్లు, సెంటర్ల వద్ద 144 సెక్షన్
AP SSC Exams 2025 Updates : ఏపీలో రేపట్నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీతో ఈ ఎగ్జామ్స్ పూర్తవుతాయి. ఈ ఏడాది 6 లక్షలకు మందికిపైగా విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
ఏపీ పదో తరగతి పరీక్షలు
ఏపీలో సోమవారం (మార్చి 16) నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఎగ్జామ్స్ కు 6 లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. పదో తరగతి పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు అమలు చేయనున్నారు.
పదో తరగతి పరీక్షలు - కట్టుదిట్టమైన ఏర్పాట్లు:
- టెన్త్ పరీక్షలకు మొత్తం 6లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వారిలో 3 లక్షల 15వేల 697 మంది బాలురు, 3లక్షల 3వేల 578 మంది బాలికలు హాజరవుతారు.
- ఈ ఏడాది పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3, 450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 163 సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలుగా గుర్తించారు. అక్కడ ప్రత్యేకమైన సీసీటీవీ కెమెరా సర్వెలెన్స్ ఏర్పాట్లు చేశారు.
- ఈసారి జరిగే పరీక్షలకు కర్నూలు,అనంతపురం,ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ మంది విద్యార్ధులు హాజరవ్వనున్నారు.
- పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక నోడలు అధికారులను నియమించారుయ
- పరీకా కేంద్రాల పరిధిలో జిరాక్స్ , నెట్ సెంటర్లను మూసివేయనున్నారు.
- ఫేక్ న్యూస్,వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది.
- పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ణలు విధిస్తారు.
- పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర స్థాయిలో 08662974540 నంబరుతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్:
ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందబాటులోకి వచ్చాయి.
- మార్చి 17న (సోమవారం) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -1.
- మార్చి 19 (బుధవారం) సెకండ్ లాంగ్వేజ్.
- మార్చి 21 (శుక్రవారం) ఇంగ్లీష్.
- మార్చి 22 (శనివారం) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1.
- మార్చి 24 (సోమవారం) మ్యాథమెటిక్స్.
- మార్చి 26 (బుధవారం) ఫిజికల్ సైన్స్.
- మార్చి 28 (శుక్రవారం) బయోలాజికల్ సైన్స్ పరీక్ష.
- మార్చి 29 (శనివారం) ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2, ఎస్‌సీసీ ఒకేషనల్ కోర్సు.
- ఏప్రిల్ 1 (మంగళవారం) సోషల్ స్టడీస్.
సంబంధిత కథనం