ఏపీలో విద్యాహక్కు చట్టం కింద 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లలో పేద, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలో(ఐబీ/సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ/స్టేట్ సిలబస్) ప్రవేశాలకు 5 సంవత్సరాలు నిండిన వారు ఈ నెల 28వ తేదీ నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రభుత్వం సీట్లు కేటాయిస్తుంది.
విద్యాహక్కు చట్టం ప్రకారం బలహీన వర్గాల పిల్లలకు వారి నివాస సమీపంలోని అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతిలో 25 శాతం కేటాయిస్తారు. విద్యార్థులు ఆధార్ ద్వారా https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో సీట్ల కేటాయింపు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎంపికైన విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత గ్రామసచివాలయం/ మండల విద్యా వనరుల కేంద్రం/ సంబంధిత పాఠశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర విషయాల కోసం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని సంప్రందిచవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 18004258599 ను సంప్రదించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
1. తల్లిదండ్రుల ఆధార్ కార్డ్/ఓటర్ కార్డు/ రేషన్ కార్డు/ భూమి హక్కుల పత్రిక/ MGNERGS జాబ్ కార్డు/ పాస్ పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు/ రెంటల్ అగ్రిమెంట్ కాపీ
2. పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం
3. అర్హత వయస్సు
a. IB/CBSE/ICSE పాఠశాలల్లో ప్రవేశాల కోసం 31.032025 నాటికి 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
b. స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం 01.06.2025 నాటికి 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
సంబంధిత కథనం