ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో నియామకాల‌కు నోటిఫికేషన్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు మే 7 ఆఖ‌రు తేదీ-ap real estate regulatory authority recruitment notification last date for application submission may 7 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో నియామకాల‌కు నోటిఫికేషన్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు మే 7 ఆఖ‌రు తేదీ

ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో నియామకాల‌కు నోటిఫికేషన్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు మే 7 ఆఖ‌రు తేదీ

HT Telugu Desk HT Telugu

ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో ఛైర్మన్, నలుగురి మెంబర్ల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు దాఖలుకు మే 7 చివరి తేదీగా నిర్ణయించారు. అప్లికేషన్ ను https://www.ap.gov.in/#/announcements వెబ్‌సైట్‌ నుంచి దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి.

ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో నియామకాల‌కు నోటిఫికేషన్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు మే 7 ఆఖ‌రు తేదీ

ఆంధ్రప్రదేశ్‌ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో నియామకాల‌కు నోటిఫికేషన్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు మే 7ను ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో ఒక ఛైర్మన్, నలుగురి మెంబర్ పోస్టుల నియామకం చేయ‌నున్నారు. అందుకు ఏపీ మున్సిప‌ల్ అండ్ ప‌ట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

అర్హతలు

ఛైర్మన్‌కు 20 సంవ‌త్సరాల అనుభ‌వం ఉండాలి. స‌భ్యుల‌కు 15 సంవ‌త్సరాల అనుభవం ఉండాలి. ఆర్థిక, సామాజిక సేవ‌, పట్టణాభివృద్ధి, హౌసింగ్, న్యాయశాస్త్రం, మౌలిక స‌దుపాయాలు, టౌన్ ప్లానింగ్‌, వాణిజ్యం, అకౌంట్సెన్సీ, పరిశ్రమ, మేనేజ్‌మెంట్‌, రియల్ ఎస్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ప్రజా వ్యవహారాలు, పరిపాలన తదితర రంగాల్లో అనుభవం ఉండాలి. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకునేందుకు వ‌యో ప‌రిమితి 65 ఏళ్లుగా నిర్ణయించారు.

ఛైర్మన్‌, స‌భ్యుల కాల‌ప‌రిమితి

ఛైర్మన్‌, స‌భ్యులకు చేరిన తేదీ నుంచి ఐదేళ్లు కాల‌ప‌రిమితి ఉంటుంది. అలాగే ఛైర్మన్‌, స‌భ్యుల వ‌య‌స్సు 65 పూర్తి అయ్యే వ‌ర‌కు కాల‌ప‌రిమితి ఉంటుంది. ఇప్పటికే ఛైర్మన్‌, స‌భ్యులుగా ఉండి ఉంటే, వారికి తిరిగి నియామ‌కం ఉండ‌దు.

ఎంపిక విధానం

ప్రభుత్వం నియమించిన సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌, స‌భ్యుల‌ను ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి లేదా అతని నామిని, రాష్ట్ర మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ అండ్ అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్ అడిష‌న‌ల్ చీఫ్ సెక్రటరీ, లేదా ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ, రాష్ట్ర న్యాయ శాఖ అడిష‌న‌ల్ చీఫ్ సెక్రటరీ, లేదా ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ, లేదా కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ఈ క‌మిటీ ప‌రిశీలించి ఎంపిక చేస్తోంది. క‌మిటీ ఎంపిక పూర్తి అయిన త‌రువాత ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తారు. ఆ త‌రువాత ఛైర్మన్‌, స‌భ్యుల బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ ఉంటుంది.

దరఖాస్తు ఇలా చేయాలి

అప్లికేషన్ https://www.ap.gov.in/#/announcements వెబ్‌సైట్‌లో ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి. ఆ ద‌ర‌ఖాస్తు హ‌ర్డ్‌కాపీని పూర్తి చేసి, సర్టిఫికేట్స్ అటెస్టేషన్ చేయించి, సీల్డ్ కవర్‌లో పోస్ట్ చేయాలి. ద‌ర‌ఖాస్తును మే 7వ తేదీ సాయంత్ర 5 గంట‌లలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. Sri Ajay Jain IAS, Special chief secretary to Government, Housing Department & Chairman search committee for AP RERA, Room No: 101, Ground floor, Building No:5, AP Secretariat, Velagapudi, Guntur Dist - 522503. అడ్ర‌స్‌కు ద‌ర‌ఖాస్తును పంపించాలి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం