AP POLYCET 2025 : ఏపీ పాలిసెట్ 2025కు దరఖాస్తు చేసుకున్నారా..? గడువు ముగుస్తోంది, ఈ లింక్ ద్వారా అప్లయ్ చేసుకోండి-ap polycet online applications ends on 15th april 2025 here direct link to apply ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Polycet 2025 : ఏపీ పాలిసెట్ 2025కు దరఖాస్తు చేసుకున్నారా..? గడువు ముగుస్తోంది, ఈ లింక్ ద్వారా అప్లయ్ చేసుకోండి

AP POLYCET 2025 : ఏపీ పాలిసెట్ 2025కు దరఖాస్తు చేసుకున్నారా..? గడువు ముగుస్తోంది, ఈ లింక్ ద్వారా అప్లయ్ చేసుకోండి

AP Polycet 2025 Applications : ఏపీ పాలిసెట్ 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు ఏప్రిల్ 15వ తేదీతో పూర్తవుతోంది. ఇందుకు మరో రెండు రోజులే గడువు ఉండటంతో…అర్హులైన విద్యార్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీ పాలిసెట్ 2025

ఏపీలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన గడువు ఏప్రిల్ 15వ తేదీతో పూర్తవుతోంది. ఇందుకు సమయం దగ్గరపడటంతో… అర్హులైన విద్యార్థులు అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇలా దరఖాస్తు చేసుకోండి…

ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు... వారి హాల్ టికెట్ నెంబర్లను ఎంట్రీ చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా విద్యార్థులు మొబైల్ నెంబర్ ను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ విద్యా అర్హత వివరాలతో పాటు మరికొన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏపీ పాలిసెట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. ఏపీ పాలిసెట్ కు దరఖాస్తు చేసుకునే ఓబీసీ, బీసీ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది.

ఏప్రిల్ 30న ఎంట్రెన్స్ పరీక్ష…

ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ 2025 ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది. ప్ర‌వేశ‌ప‌రీక్ష ఆఫ్‌లైన్ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు వారం ముందు హాల్ టికెట్లను విడుదల చేస్తారు. మే 10వ తేదీన ఎంట్రెన్స్ ఫలితాలను ప్రకటిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా 500 ప‌రీక్షా కేంద్రాల్లో ఏపీ పాలిసెట్ ప‌రీక్ష నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 120 ప్ర‌శ్న‌లు ఉంటాయి. మ్యాథ‌మెటిక్స్ నుంచి 50 ప్రశ్న‌లు, ఫిజిక్స్ నుంచి 40 ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఇక కెమిస్ట్రీ నుంచి 30 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప‌రీక్ష సమయం 2 గంటలుగా ఉంటుంది. ప‌దో త‌రగ‌తి స్థాయిలోనే ప్రశ్నలను అడుగుతారు.

వెబ్ సైట్ లో ఫ్రీ మెటీరియల్….

ఏపీ పాలిసెట్ విద్యార్థుల కోసం ఏపీ సాంకేతిక విద్యాశాఖ ఫ్రీ స్టడీ మెటీరియల్ ను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం మెటరీయల్ అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఈ స్టడీ మెటీరియల్ కాపీని పొందవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి…

  1. ఏపీ పాలిసెట్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉచితంగా స్టడీ మెటరీయల్ పొందాలంటే ముందుగా https://polycetap.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలోని నోటిఫికేషన్ లో చూస్తే AP POLYCET Study Material - 2025 ఆప్షన్ కనిపిస్తుంది.
  3. ఇక్కడే తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఏ మీడియం మెటీరియల్ కావాలనుకుంటే… ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
  4. మీకు పీడీఎఫ్ రూపంలో మెటీరియల్ డౌన్లోడ్ అవుతుంది.దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ పాలిసెట్ - 2025కు దరఖాస్తు చేసుకోవచ్చు..

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.