ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి లోకేశ్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు https://polycetap.nic.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
"ఏప్రిల్ 30, 2025న జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ప్రభుత్వం కలలుగన్నట్లుగా, సమీప భవిష్యత్తులో ఏపీ నుండి మరిన్ని మహిళా వ్యవస్థాపకులు, సాంకేతిక నిపుణులను చూడాలనే ఆశను రేకెత్తిస్తూ, బాలికలు 96.9% మందితో మెరుగ్గా రాణించడం చూసి సంతోషంగా ఉంది. విజయవంతమైన అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు"- మంత్రి లోకేశ్
పాలిసెట్ ఫలితాల్లో అల్లూరి జిల్లా 98.66% అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసింది. 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించారు.
వాట్సాప్ (మన మిత్ర): 9552300009 కు "హాయ్" అని పంపి పాలిసెట్ ఫలితాలు తనిఖీ చేయవచ్చు.
1.బడ్డీ శశి వెంకట్- తూర్పు గోదావరి- 120 మార్కులు
2.బాలినేని కల్యాణ్ రామ్- విశాఖపట్నం- 120 మార్కులు
3. మేర్ల జె ఎస్ ఎన్ వీ చంద్ర హర్ష- తూర్పు గోదావరి- 120 మార్కులు
4. బొడ్డీటి. శ్రీకర్- పశ్చిమగోదావరి- 120 మార్కులు
5. వూన్న వరుణ్ తేజ్ -తూర్పుగోదావరి- 120 మార్కులు
6. వెల్పురి ప్రవల్లిక-పశ్చిమగోదావరి -120 మార్కులు
7. ఆకుల నిరంజన్ శ్రీరామ్ -తూర్పుగోదావరి- 120 మార్కులు
8.చింతాడ.చోహన్- విశాఖపట్నం- 120 మార్కులు
9. కొడతి. కృష్ణ ప్రణయ్- పశ్చిమ గోదావరి- 120 మార్కులు
10. బళ్ల రిషిత శ్రీ స్వప్న- తూర్పుగోదావరి- 120 మార్కులు
11. రుపిటి.చాహ్నా- తూర్పు గోదావరి -120 మార్కులు
12 పాల రోహిత్- పశ్చిమ గోదావరి- 120 మార్కులు
13.ఉరుపుటూరి. చక్రవర్తులు సిరి దీపిక-పశ్చిమ గోదావరి- 120 మార్కులు
14. చలువాడి ఖదీశ్- ప్రకాశం - 120 మార్కులు
15. కొప్పిశెట్టి అభిజిత్- కాకినాడ- 120 మార్కులు
16. పకలపాటి.నితీష్ -పశ్చిమ గోదావరి- 120 మార్కులు
17. యెల్లిశెట్టి. హేమచంద్ర కుమార్- తూర్పుగోదావరి- 120 మార్కులు
18. ఆదిన యశ్వంత్ పవన్ సాయిరామ్- పశ్చిమ గోదావరి- 120 మార్కులు
19. మండవిల్లి ఉమా దుర్గా్ శ్రీనిధి -తూర్పు గోదావరి -120 మార్కులు
సంబంధిత కథనం