ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు రిక్రూట్ మెంట్ బోర్డు కీలక అప్జేట్ ఇచ్చింది. తుది రాత పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు slprb.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. జూన్ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష…. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ ఉంటుంది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూల్, తిరుపతి నగరాలు ఎగ్జామ్ సెంటర్లుగా ఉన్నాయి. ఇక హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 9441450639 లేదా 9100203323 హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చని బోర్డు సూచించింది. లేదా mail-slprb@gov.in కు మెయిల్ చేయవచ్చు. ఆఫీస్ పని వేళల్లో మాత్రమే వీటిని చేయాలని స్పష్టం చేసింది.
సంబంధిత కథనం