రాష్ట్రంలో పీజీ ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్ - 2025కు సంబంధించిన హాల్ టికెట్లు వచ్చేశాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు cets.apsche.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఈ సెట్‌ను ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) నిర్వహిస్తోంది.
జూన్ 6 నుంచి జూన్ 8 వరకు ఏపీ పీజీఈసెట్-2025 ఎంట్రెన్స్ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక సెషన్ , మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. ప్రిలిమినరీ కీని జూన్ 11న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తారు. జూన్ 14 రాత్రి 11.59 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూన్ 24వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.