రేపట్నుంచి ఏపీ పీజీసెట్ 2025 పరీక్షలు - షెడ్యూల్ ఇదే-ap pgcet 2025 exams to begin from june 9 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  రేపట్నుంచి ఏపీ పీజీసెట్ 2025 పరీక్షలు - షెడ్యూల్ ఇదే

రేపట్నుంచి ఏపీ పీజీసెట్ 2025 పరీక్షలు - షెడ్యూల్ ఇదే

ఏపీ పీజీసెట్ - 2025 పరీక్షలు జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎంట్రెన్స్ ఆధారంగా పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

ఏపీ పీజీసెట్ - 2025

ఏపీ పీజీ సెట్‌-2025 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపట్నుంచి(జూన్ 09) నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ నిర్ణయించిన ప్రకారం… జూన్ 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ఎగ్జామ్ జరుగుతాయి. ఈ పరీక్ష కోసం 25 వేలకుపైగా అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు.

జూన్ 25న ఫలితాలు…

ఏపీ పీజీసెట్ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలను జూన్ 11వ తేదీ నుంచి 15 తేదీల మధ్య విడుదల చేస్తారు. వీటిపై 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూన్ 25వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

ఏపీ పీజీసెట్ - 2025 లో సాధించిన ర్యాంకులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ ఎంట్రెన్స్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పీజీ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఫలితాల విడుదల తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేస్తారు.

హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

  1. ముందుగా https://cets.apsche.ap.gov.in/APSCHE/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు ఎగ్జామ్ పేపర్ ను ఎంచుకోవాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఏపీ పీజీసెట్ పరీక్షల షెడ్యూల్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం