APOSS Inter Hall Tickets 2025 : ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ(APOSS) ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు ఏపీఓఎస్ఎస్ అమరావతి అధికారిక వెబ్‌సైట్ https://apopenschool.ap.gov.in/ లో మార్చి 2025 ఇంటర్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి3 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇంటర్మీడియట్ కోర్సులకు నిర్వహించే పరీక్షలకు హాల్ టికెట్లను విడుదల చేశారు. ఏపీఓఎస్ఎస్, అమరావతి వెబ్ సైట్ లో విద్యార్థి పేరు, స్కూల్ పేరు, జిల్లా వివరాలు అందించి హాల్ టికెట్ పొందవచ్చు.
ఇంటర్మీడియట్ పరీక్షలను ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు నిర్వహిస్తారు. పరీక్షలో పాల్గొనే విద్యార్థులు పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం గంట ముందుగా సంబంధిత పరీక్షా కేంద్రంలో ఫోటో గుర్తింపు కార్డు, హాల్ టికెట్ తో రిపోర్ట్ చేయాలి.
సంబంధిత కథనం