APOSS Exams Schedule : ఏపీ ఓపెన్ ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - ఇవిగో తేదీలు
ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 3 నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్ మార్చి 17 నుంచి నిర్వహించనున్నారు.
రాష్ట్ర సార్వత్రిక విద్యా పీఠం (ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ) ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 3 నుంచి ప్రారంభం కాగా… పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం సంచాలకులు ఆర్. నరసింహారావు షెడ్యూల్‌ను ప్రకటించారు.
పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా కసరత్తు చేపట్టారు. ఎగ్జామినేషన్ సెంటర్లు గుర్తించడం, పరీక్షలు రాసే విద్యార్థులు సంఖ్య వంటి అంశాలపై జిల్లాల్లో విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్:
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఆరో రోజులు పాటు జరుగుతాయి. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.
- మార్చి 3 (సోమవారం) - ఇంగ్లీష్
- మార్చి 5 (బుధవారం) - హిందీ, తెలుగు, ఉర్దూ
- మార్చి 7 (శుక్రవారం) - కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సామాజిక శాస్త్రం
- మార్చి 10 (సోమవారం) - ఫిజిక్స్, సివిక్స్, మనో విజ్ఞాన శాస్త్రం
- మార్చి 12 (బుధవారం) - మ్యాథమెటిక్స్, హిస్టరీ, వ్యాపార గణక శాస్త్రం
- మార్చి 15 (శనివారం) - జీవ శాస్త్రం, కామర్స్, గృహ విజ్ఞాన శాస్త్రం
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు:
ఓపెన్ టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఆరో రోజులు పాటు జరుగుతాయి. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి.
- మార్చి 17 (సోమవారం) - హిందీ
- మార్చి 19 (బుధవారం) - ఇంగ్లీష్
- మార్చి 21 (శుక్రవారం) - తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం
- మార్చి 24 (సోమవారం) - గణితం, భారతీయ సంస్కృతి, వారసత్వం
- మార్చి 26 (బుధవారం) - సాంకేతిక విజ్ఞాన శాస్త్రం, గృహ విజ్ఞాన శాస్త్రం
- మార్చి 28 (శనివారం) - సాంఘిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం
ఈనెల 10 నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్స్
ఇక రాష్ట్రంలో ఈనెల 10వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ తెలిపింది. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహణ జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు అందుకనుగుణంగా సిద్ధంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ కోరింది.
- ఫిబ్రవరి 10న ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కాంపోజిట్ కోర్సు)
- ఫిబ్రవరి 11న సెకండ్ లాంగ్వేజ్
- ఫిబ్రవరి 12న ఇంగ్లీష్
- ఫిబ్రవరి 13న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
- ఫిబ్రవరి 15న గణితం
- ఫిబ్రవరి 17న భౌతిక శాస్త్రం
- ఫిబ్రవరి 18న జీవ శాస్త్రం
- ఫిబ్రవరి 19న ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), ఎస్ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)
- ఫిబ్రవరి 20న సోషల్ స్టడీస్
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం