ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్లు వచ్చేశాయ్ - ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ap mega dsc 2025 hall tickets released know these key details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్లు వచ్చేశాయ్ - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్లు వచ్చేశాయ్ - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 6 నుంచి పరీక్షలు ప్రారంభమై…. జులై 6వ తేదీతో ముగుస్తాయి..

ఏపీ డీఎస్సీ 2025 హాల్ టికెట్లు విడుదల

ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్లు వచ్చేశాయ్. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వారి లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి వీటిని పొందవచ్చు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఏపీ మెగా డీఎస్సీలో భాగాగం…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీకి 3,35,401 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకోగా… అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పరీక్షలు జూన్‌ 6 నుంచి ప్రారంభమై…. జులై 6వ తేదీతో ముగుస్తాయి.

ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  1. దరఖాస్తు చేసుకున్న వాళ్లు https://apdsc.apcfss.in/ వెబ్ సైైట్ లోకి వెళ్లాలి.
  2. ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ అభ్యర్థి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

విస్తృత ఏర్పాట్లు…

ఏపీ డీఎస్సీ పరీక్షలో కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాలను కూడా ఖరారు చేసింది. ఏపీలోనే కాకుండా…. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు చోటు చేసుకుండా కఠిన చర్యలు చేపట్టింది.

డీఎస్సీ పరీక్షలను రోజూ రెండు సెషన్ల వారీగా నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మరో సెషన్ జరుగుతుంది. ప్రిన్సిపల్, పీజీటీ, పీడీ పోస్టులకు పరీక్ష మూడు గంటలపాటు ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. మరోవైపు టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ అభ్యర్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇందుకు గంటన్నర సమయం కేటాయించారు.

మరోవైపు డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. ప్రాథమిక కీల విడుదల తర్వాత 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీని ప్రకటిస్తారు. తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా విడుదలవుతాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.