ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అప్డేట్ - పలు సబ్జెక్టుల ప్రాథమిక 'కీ'లు విడుదల, ఇదిగో లింక్-ap mega dsc 2025 exams primary key released for various subjects ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అప్డేట్ - పలు సబ్జెక్టుల ప్రాథమిక 'కీ'లు విడుదల, ఇదిగో లింక్

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అప్డేట్ - పలు సబ్జెక్టుల ప్రాథమిక 'కీ'లు విడుదల, ఇదిగో లింక్

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. పలు సబ్జెక్టుల ప్రాథమిక కీలను విడుదల చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. వీటిపై అభ్యంతరాలు ఉంటే జూలై 11 వరకు స్వీకరిస్తారు.

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు 2025

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు సబ్జెక్టుల ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా… తాజాగా విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. మెగా డీఎస్సీలో భాగంగా జూన్ 6 నుంచి జూన్ 28 వరకు జరిగిన వివిధ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను గురువారం విడుదల చేశారు. వీటికి సంబంధించిన వివరాలను మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ప్రాథమిక కీలు విడుదలైన సబ్జెక్టుల వివరాలు:

  • పీజీటీ విభాగంలో కామర్స్, ఇంగ్లీష్, హిందీ, ఫిజికల్ సైన్స్, సంస్కృతం, సోషల్, తెలుగు సబ్జెక్టుల ప్రాథమిక కీలు, రెస్పాన్స్ షీట్లు అందుబాటులోకి వచ్చాయి.
  • స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్
  • ఎస్జీటీ విభాగంలో ఎస్జీటీ జనరల్, ఎస్‌జీటీ – స్పెషల్ హెచ్‌హెచ్ (వినికిడి లోపం ఉన్నవారికి ), ఎస్‌జీటీ – స్పెషల్ వీహెచ్ (దృష్టి లోపం ఉన్నవారికి ప్రత్యేక ఎస్‌జీటీ).
  • టీజీటీ విభాగంలో ఇంగ్లీష్, హిందీ, ఫిజికల్ సైన్స్, సైన్స్ (విజ్ఞాన శాస్త్రం), సోషల్, తెలుగు.
  • ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్ష (ENGLISH PROFICIENCY TEST) రెస్పాన్స్ షీట్స్ తో పాటు ప్రాథమిక కీలను విడుదల చేశారు.
  • పీఈటీ – హెచ్‌హెచ్ (వినికిడి లోపం ఉన్నవారికి - Hearing Impaired), పీఈటీ – వీహెచ్ (దృష్టి లోపం ఉన్నవారికి - Visually Impaired), PHYSICAL EDUCATION TEACHER (PET) - ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షలకు సంబంధించి అన్ని మాధ్యమాల కీ, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో వచ్చాయి.

అభ్యంతరాలకు జూలై 11 గడువు…

తాజాగా విడుదలైన ప్రాథమిక కీలపై అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను స్వీకరిస్తారు. వీటిని సంబంధిత ఆధారాలతో జూలై 11 లోపు https://apdsc.apcfss.in వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు. జూన్ 29 నుండి జూలై 2 వరకు జరిగే పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు కూడా త్వరలో విడుదల చేస్తామమని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలను నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో సజావుగా, శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తి అయినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణా రెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 91.72 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారని వివరించారు.

ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అధిక సంఖ్యలోనే అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఇక డీఎస్సీ ఫలితాల్లో టెట్ స్కోర్ కీలకంగా ఉంటుంది. ఇందులో సాధించే వెయిటేజీని డీఎస్సీ మార్కులకు జత చేస్తారు. ఈ రెండింటి ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాలను జిల్లాల వారీగా విడుదల చేస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.