తెలుగు న్యూస్ / career /
AP LAWCET Counselling : ఏపీ లాసెట్ స్పాట్ అడ్మిషన్లు - ఈనెల 5 వరకు రిజిస్ట్రేషన్లు, ముఖ్య వివరాలివే
AP LAWCET Counselling 2024 Updates: ఏపీలో లాసెట్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు.. జనవరి 5లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీ లాసెట్ స్పాట్ అడ్మిషన్లు 2024
ఏపీలో లాసెట్ ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే రెండు విడతల్లో సీట్ల కేటాయింపు జరగా… తాజాగా అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. స్పాట్ అడ్మిషన్లుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు… జనవరి 5, 2025వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు పూర్తి వివరాలను వెబ్ సైట్ లో ఉంచారు.
- ఎల్ఎల్ బీ మూడేళ్లు, ఐదేళ్ల కోర్సులు, పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది.
- ఆన్ లైన్ లో నిర్ణయించిన ఫీజు (రూ. 1000/)చెల్లించాల్సి ఉంటుంది.
- అర్హులైన అభ్యర్థులు నేరుగా కాలేజీలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి.
- ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
- స్పాట్ అడ్మిషన్లలో కూడా లాసెట్ ర్యాంక్ కార్డు కీలకంగా ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
- స్పాట్ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ లింక్ : https://lawcet-sche.aptonline.in/LAWCET/Views/spotindex.aspx
స్పాట్ అడ్మిషన్ కు కావాల్సిన ధ్రువపత్రాలు :
- ఏపీ లాసెట్ ర్యాంక్ కార్డు - 2024
- పదో తరగతి మెమో
- ఇంటర్మీడియట్ మెమో
- డిగ్రీ ఒరిజినల్ మెమో
- స్టడీ సర్టిఫికెట్స్
- టీసీ
- కుల ధ్రువీకరణపత్రం
- రెసిడెన్స్ సర్టిఫికెట్
ఈ ఏడాది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లాసెట్- 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏపీ లాసెట్ పరీక్షను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలు జూన్ 27న వెల్లడించారు. ఇప్పటికే రెండు విడతల్లో సీట్లను కేటాయించారు.
ఏపీ లాసెట్ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి…
- అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నెంబర్ , హాల్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
- గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.
సంబంధిత కథనం