ఏపీ లాసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయ విద్య కాలేజీల్లోని మూడేళ్లు, ఐదేళ్లు, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు… cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం… లాసెట్ కు మొత్తం 27,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా…20,826 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మూడేళ్లు, ఐదేళ్ల లా, పీజీ ఎంట్రెన్స్ పరీక్షలన్నీ కలిపి 95 శాతానికిపైగా ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలను మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఏపీ లాసెట్ రిజల్ట్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలు కింది విధంగా ఉంటాయి….
Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.
Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.
Step 3 : 'ఏపీ లాసెట్ ఫలితాలు - 2025' పై క్లిక్ చేయాలి.
Step 4 : మీ ర్యాంక్ కార్డు డిస్లే అవుతుంది.
లాసెట్ ఎంట్రెన్స్ పరీక్షలోని ర్యాంకులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు. ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేస్తారు. దశల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది.