ఏపీ లాసెట్ ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల - ఈ లింక్స్ తో డౌన్లోడ్ చేసుకోండి-ap lawcet 2025 preliminary key released direct link here to download ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ లాసెట్ ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల - ఈ లింక్స్ తో డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ లాసెట్ ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల - ఈ లింక్స్ తో డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ లాసెట్ ఎంట్రెన్స్ 2025 ప్రిలిమినరీ కీలు విడుదలయ్యాయి. అంతేకాకుండా రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ నుంచి వీటిని పొందవచ్చు.

ఏపీ లాసెట్ 2025

ఏపీ లాసెట్ - 2025 ప్రవేశ పరీక్ష ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఎంట్రెన్స్ ప్రవేశ పరీక్ష ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించేందుకు గడువు కూడా పెట్టారు.

ఈనెల 5వ తేదీన ఏపీ లాసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరిగింది. మూడేళ్లు, ఐదేళ్ల కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఇందుకు 27 వేలకుపైగా అభ్యర్థులు హాజరయ్యారు. వీరంతా కూడా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఏపీ లాసెట్ ప్రిలిమినరీ కీ - డౌన్లోడ్ ఇలా:

  1. అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ ఎల్ఎల్ బీ మూడేళ్లు, ఎల్ఎల్ బీ ఐదేళ్లు, ఎల్ఎల్ఏం ఆప్షన్లు ఉంటాయి.
  4. మీరు ఏ పరీక్ష రాశారో ఆ ఆప్షన్ పై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  5. ప్రిలిమినరీ కీ ఆధారంగా మీరు సాధించే మార్కుల విషయంలో ఓ అవగాహనకు రావొచ్చు.

ఏపీ లాసెట్ ప్రిలిమినరీ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. ఇందుకు జూన్ 8వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఈలోపే నిర్ణీత నమూనాలో పంపాల్సి ఉంటుంది. లాసెట్ వెబ్ సైట్ లో కనిపించే కీ అబ్జెక్షన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్, లాసెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. ఆపై మీ అభ్యంతరాలను పంపొచ్చు.

ఫలితాలు ఎప్పుడంటే…?

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 16వ తేదీన ఏపీ లాసెట్ ఫైనల్ కీని విడుదల చేస్తారు. జూన్ 22వ తేదీన ర్యాంకులను వెల్లడిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. వీటికి తోడు రిజర్వేషన్ల ఆధారంగా కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ విడదలవుతుంది. దశల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.