ఆంధ్రప్రదేశ్ లాసెట్ 2025నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మూడేళ్లు, ఐదేళ్లతో పాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది శ్రీపద్మావతి మహిళ యూనివర్శిటీ పరీక్ష బాధ్యతలను చూస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను శనివారం (మార్చి 22) విడుదల కాగా… ఏప్రిల్ 25 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 27 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. జూన్ 5న లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. పీజీ కోర్సుల్లోప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే వారు లా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎలాంటి వయోపరిమితి ఉండదు.
పూర్తిస్థాయి నోటిఫికేషన్ వివరాలను ఏపీ ఉన్నత విద్యామండలి వెబ్ సైట్ లో చూడొచ్చు. ఇక్కడ ఏపీ లాసెట్ 2025 పై క్లిక్ చేసి… ప్రాసెసింగ్ ఫీజు చెల్లించటంతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు. సిలబస్, పరీక్షా విధానం వివరాలను తెలుసుకోవచ్చు.
ఏపీ లాసెట్ పరీక్షలను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. సీబీటీ విధానంలో ఉంటుంది. మొత్తం మూడు సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ ఏ లో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి 30 మార్కులు కేటాయిస్తారు. ఇక పార్ట్ బీలో కరెంట్ ఎఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. మిగతా 60 మార్కులు భారత రాజ్యాంగం, లీగల్ అప్టిట్యూడ్ నుంచి అడుగుతారు. ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ చూస్తే… 2 సెక్షన్లు ఉంటాయి. లేబర్ లా, క్రైమ్స్ అండ్ టార్ట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇంటర్నేషన్ లా, బిజిెన్స్ అండ్ కార్పొరేట్ లా, JURISPRUDENCE, భారత రాజ్యాంగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 120 మార్కులకు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేస్తారు. ర్యాంక్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. గతేడాది చాలా ఆలస్యంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి అలా కాకుండా…. త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.
తెలంగాణ లాసెట్ షెడ్యూల్ - 2025 విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 15, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 4 వేల ఆలస్య రుసుంతో మే 25వ తేదీ వరకు గడువు ఉంది.