ఏపీ లాసెట్ -2025 హాల్ టికెట్లు విడుదల.... ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ap lawcet 2025 hall tickets out here direct link to download ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ లాసెట్ -2025 హాల్ టికెట్లు విడుదల.... ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ లాసెట్ -2025 హాల్ టికెట్లు విడుదల.... ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ లాసెట్ - 2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష జరనుంది.

ఏపీ లాసెట్ హాల్ టికెట్లు 2025

ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లు, ఐదేళ్ళ లా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే లాసెట్‌ 2025 కు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఎంట్రెన్స్ పరీక్ష హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. జూన్ 5వ తేదీన లాసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరగనుంది. జూన్ 22వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

ఏపీ లాసెట్ హాల్ టికెట్లు - ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/LAWCET వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందాలి.
  • పరీక్షా కేంద్రంలోకి వెళ్లటానికి హాల్ టికెట్ తప్పనిసరి. అడ్మిషన్ ప్రక్రియలోనూ ఉపయోగపడుతుంది.

ఏపీ లాసెట్ - 2025 పరీక్ష విధానం:

ఏపీ లాసెట్ పరీక్షలను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. సీబీటీ విధానంలో ఉంటుంది. మొత్తం 3 సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ ఏ లో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి 30 మార్కులు కేటాయిస్తారు. ఇక పార్ట్ బీలో కరెంట్ ఎఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. మిగతా 60 మార్కులు భారత రాజ్యాంగం, లీగల్ అప్టిట్యూడ్ నుంచి అడుగుతారు.

ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ చూస్తే… రెండు సెక్షన్లు ఉంటాయి. లేబర్ లా, క్రైమ్స్ అండ్ టార్ట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇంటర్నేషన్ లా, బిజిెన్స్ అండ్ కార్పొరేట్ లా, JURISPRUDENCE, భారత రాజ్యాంగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 120 మార్కులకు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.

ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. వీటికి తోడు రిజర్వేషన్ల ఆధారంగా కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ విడదలవుతుంది. దశల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.