AP LAWCET 2025 Updates : ఏపీ లాసెట్ 2025 దరఖాస్తులు ప్రారంభం - ఇలా అప్లయ్ చేసుకోండి
AP LAWCET Registrations 2025: ఏపీ లాసెట్ 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు… ఏప్రిల్ 27వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. జూన్ 5వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు. జూన్ 22వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
ఏపీ లాసెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూడేళ్లు, ఐదేళ్లతో పాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 27వ తేదీ వరకు ఎలాంటి ఆపరాధ రుసుం లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. రూ. 10 వేల ఫైన్ తో మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ ఏడాది లాసెట్ ప్రవేశ పరీక్షల బాధ్యతలను శ్రీ పద్మావతి మహిళ యూనివర్శిటీ చూస్తోంది. జూన్ 5న లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. పీజీ కోర్సుల్లోప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే వారు లా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎలాంటి వయోపరిమితి ఉండదు.
ఏపీ లాసెట్ 2025 దరఖాస్తు విధానం…!
- అభ్యర్థులు ముందుగా ఏపీ ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఇక్కడ ఏపీ లాసెట్ - 2025 పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది.
- ముందుగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత Fill Application Form ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
- మీ వివరాలను నమోదు చేయటంతో పాటు మీ ఫొటో, సంతకాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.
ఏపీ లాసెట్ ముఖ్య తేదీలు:
- ప్రవేశ పరీక్ష : ఏపీ లాసెట్ - 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 25- 03- 2025.
- రూ. 1000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ : 28-04-2025 నుంచి 04-05-2025.
- రూ. 2000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ : 05-05-2025 నుంచి 11-05-2025.
- రూ. 4000 ఫైన్ తో : 12-05-2025 నుంచి 18-05-2025.
- రూ.10000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ : 19-05-2025 నుంచి 25-05-2025.
- దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ : 26-05-2025 నుంచి 27-05-2025 వరకు.
- హాల్ టికెట్ల డౌన్లోడ్ : 30-05-2025 నుంచి వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఎగ్జామ్ తేదీ - 05-06-2025 (ఉదయం 9.00 AM నుంచి 10.30 గంటల వరకు)
- ప్రిలిమినరీ కీ - 06-06-2025.
- తుది ఫలితాలు - 22-06-2025.
ఏపీ లాసెట్ పరీక్షలను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. సీబీటీ విధానంలో ఉంటుంది. మొత్తం మూడు సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ ఏ లో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి 30 మార్కులు కేటాయిస్తారు. ఇక పార్ట్ బీలో కరెంట్ ఎఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. మిగతా 60 మార్కులు భారత రాజ్యాంగం, లీగల్ అప్టిట్యూడ్ నుంచి అడుగుతారు.
ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ చూస్తే… రెండు సెక్షన్లు ఉంటాయి. లేబర్ లా, క్రైమ్స్ అండ్ టార్ట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇంటర్నేషన్ లా, బిజిెన్స్ అండ్ కార్పొరేట్ లా, JURISPRUDENCE, భారత రాజ్యాంగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 120 మార్కులకు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. ఈ ఫలితాలను ఏపీ లాసెట్ 2025 వెబ్ సైట్ లో చూడొచ్చు.
సంబంధిత కథనం