AP LAWCET 2025 Updates : దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫలితాల వరకు...! ఏపీ లాసెట్ ముఖ్య తేదీలివే-ap lawcet 2025 application registration has begun here direct link to aplly ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Lawcet 2025 Updates : దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫలితాల వరకు...! ఏపీ లాసెట్ ముఖ్య తేదీలివే

AP LAWCET 2025 Updates : దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫలితాల వరకు...! ఏపీ లాసెట్ ముఖ్య తేదీలివే

AP LAWCET Notification 2025 : ఏపీ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 27 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా ఫీజులు చెల్లించాలి. జూన్ 5న లాసెట్ పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 22వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

ఏపీ లాసెట్ 2025

ఆంధ్రప్రదేశ్‌ లాసెట్ 2025 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూడేళ్లు, ఐదేళ్లతో పాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.ఏప్రిల్ 27 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ లాసెట్ - 2025 కు ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు రూ.1000 జరిమానా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మే 5 నుంచి మే 11 వరకు రూ. 2 వేలు చెల్లించి అప్లికేషన్ చేసుకోవాలి. మే 12 నుంచి మే 18 వరుక రూ. 4 వేలు, మే 19 నుంచి మే 25 వరకు రూ. 10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది.

మే 26 నుంచి మే 27 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. మే 30వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 5న లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 22వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. పీజీ కోర్సుల్లోప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే వారు లా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎలాంటి వయోపరిమితి ఉండదు.

ఏపీ లాసెట్ 2025 - దరఖాస్తు విధానం:

  • అర్హులైన అభ్యర్థులు ఏపీ ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ఇక్కడ ఏపీ లాసెట్ - 2025 ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • ముందుగా నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిల్ అప్లికేషన్ ఆప్షన్ పై నొక్కి ప్రాసెస్ చేసుకోవచ్చు.
  • ఇక్కడ Payment Reference ID, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి క్లిక్ చేయాలి.
  • ఇక్కడ దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను నమోదు చేయాలి. మీ ఫొటో, సంతకాన్ని కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • చివర్లో సబ్మిట్ బటన్ పై నొక్కితే ప్రాసెస్ పూర్తవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.

ఏపీ లాసెట్ ముఖ్య తేదీలు:

  • లాసెట్ 2025 ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 27- 04- 2025.
  • రూ. 1000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ : 28-04-2025 నుంచి 04-05-2025.
  • రూ. 2000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ : 05-05-2025 నుంచి 11-05-2025.
  • రూ. 4000 ఫైన్ తో : 12-05-2025 నుంచి 18-05-2025.
  • రూ.10,000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ : 19-05-2025 నుంచి 25-05-2025.
  • దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ : 26-05-2025 నుంచి 27-05-2025 వరకు.
  • హాల్ టికెట్ల డౌన్లోడ్ : 30-05-2025 నుంచి అందుబాటులోకి వస్తాయి
  • పరీక్ష తేదీ - 05-06-2025 (ఉదయం 9.00 AM నుంచి 10.30 గంటల వరకు)
  • ప్రిలిమినరీ కీ విడుదల - 06-06-2025.
  • ఏపీ లాసెట్ 2025 ఫలితాలు - 22-06-2025.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ లాసెట్ - 2025 అప్లికేషన్ ఫీజు చెల్లించుకోవచ్చు

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ లాసెట్ - 2025 కు దరఖాస్తు చేసుకోవచ్చు

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం