AP Inter Results 2025 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు-ap intermediate supplementary exam 2025 dates announced know these key details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Inter Results 2025 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

AP Inter Results 2025 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

AP Inter Supplementary Exams 2025 : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలు వచ్చేశాయ్. మే 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య వివరాలను వెల్లడించారు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 (unsplash)

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్థులు… ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఫీజులు చెల్లించుకోవచ్చు. ఏప్రిల్ 22వ తేదీ వరకు గడువు ఉంటుంది.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం 9 నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం 02 30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

ఇక ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ ఫలితాలు హిందుస్తామ్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ తో పాటు ఏపీ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఈసారి సరికొత్తగా వాట్సాప్ (మన మిత్ర నెంబర్) లోనూ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 10,17,102 మంది పరీక్షలకు హాజరయ్యారు.

బాలికలదే పైచేయి…

ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందైంది.మొదటి సంవత్సరం విద్యార్థులకు 70 శాతం, రెండో సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 83గా నమోదైంది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

ఇక ఈ ఏడాది కూడా ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా కొనసాగింది. మొదటి సంవత్సరం బాలికల ఉత్తీర్ణత 71 శాతంగా ఉంటే బాలుర ఉత్తీర్ణత.. 64 శాతంగా నమోదైంది. ఇక రెండవ సంవత్సరం బాలికల ఉత్తీర్ణత 81 శాతంగా ఉంటే బాలుర ఉత్తీర్ణత.. 75 శాతంగా ఉంది. వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం 71 శాతంగా ఉంది.

ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 - HT తెలుగు లింక్స్

  1. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 2025 - https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-intermediate-1st-year-result 
  2. ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు 2025 -https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-board-intermediate-2nd-year-result 
  3. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఫలితాలు 2025 -https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-inter-first-year-voc-result 
  4. ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ ఫలితాలు 2025 -https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-inter-second-year-voc-result 

 

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం