ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి.ఈ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా జా ఓ ప్రకటన ద్వారా ప్రకటించారు. అర్హులైన విద్యార్థులు… వెంటనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూన్ 30వ తేదీతోనే ప్రవేశాల గడువు ముగిసింది. అయితే విద్యార్థులతో పాటు పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో… ఈ గడువును పొడిగించారు. దీంతో టెన్త్ పాస్ అయిన విద్యార్థులు… జూలై 30వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోవచ్చు.
ఇక 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ బోర్డు ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ ను కూాడా విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ జూనియర్ కాలేజీలు మొత్తం 314 పని దినాలు పని చేస్తాయి. మొత్తం 79 రోజులు సెలవులు ఉండనున్నాయి.
అకడమిక్ షెడ్యూల్ ప్రకారం… ఏపీలో జూన్ 2 కాలేజీలు పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు జరుగుతున్నాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు కొనసాగుతున్నాయి.సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 దసరా సెలవులు ఉంటాయి. ఇక జనవరి 10 – జనవరి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ఫిబ్రవరి 2026లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తాయి. మార్చి 2026లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి.