ఏపీ ఇంటర్మీడిట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానుండగా… ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. మార్చి 24వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి.
ఇక ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23వ తేదీన నిర్వహిస్తారు. సెకండియర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 10వ తేదీతో ముగుస్తాయి. ఈ పరీక్షలు పూర్తి అయ్యాక… హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తారు.
సంబంధిత కథనం