ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వైబ్ సైట్ లో https://bie.ap.gov.in/ నుంచి హాల్ టికెట్లు నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్లును వెబ్ సైట్, వాట్సా్ప్ మన మిత్రలో అందుబాటులో ఉంచారు. మే 12 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
1. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2. రెండో సంవత్సరం విద్యార్థి సెకండియర్ హాల్ టికెట్ నంబర్ / మునుపటి హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
3. ఫొటో లేదా సంతకం కనిపించకపోతే విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించి పరీక్షలకు హాజరయ్యే ముందు దాన్ని సరిదిద్దుకోవచ్చు.
4. హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు.
ఏపీలో మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మే 28 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 4న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష , జూన్ 6న పర్యావరణ విద్య నిర్వహించనున్నారు.
సంబంధిత కథనం