ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - రేపు సప్లిమెంటరీ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి-ap inter supplementary exam results to release on on 7 june 2025 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - రేపు సప్లిమెంటరీ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - రేపు సప్లిమెంటరీ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. జూన్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025

ఇంటర్ విద్యార్థులకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల తేదీని ప్రకటించింది. రేపు(జూన్ 07) ఉదయం 11 గంటలకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ తెలిపింది. ఈ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ లో లేదా మనమిత్ర 9552300009 వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఏపీ ఇంటర్ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు రెండు సెషన్లలో జరిగాయి. ఉదయం సెషన్‌లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం సెషన్‌లో రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించారు.

వాట్సాప్ లో ఇలా చెక్ చేసుకోండి:

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.

Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.

Step 3 : 'డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు- 2025' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4 : మార్కుల మెమో పొందడానికి మీ 'హాల్ టికెట్' నెంబర్‌ను నమోదు చేయాలి.

Step 5 : PDF రూపంలో ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఇలా….

ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

  • Step 1: విద్యార్థులు ఏపీ ఇంటర్ విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ పై క్లిక్ చేయాలి.
  • Step 2: వెబ్‌సైట్ హోమ్‌పేజీ 'AP IPE ఫలితాలు 2025' అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • Step 3: తర్వాత ఇంటర్ 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలపై క్లిక్ చేయండి. లాగిన్ విండో ఓపెన్ అవుతుంది.
  • Step 4: లాగిన్ విండోలో విద్యార్థి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి.
  • Step 5 : స్క్రీన్ పై ఇంటర్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. భవిష్యత్ అవసరాల కోసం ఇంటర్ మార్క్ షీట్ డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.