ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం…. ఇవాళ ఉదయం 11 గంటల ఫలితాలను అందుబాటులో ఉంచారు.
ఏపీలో ఈ ఏడాది ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 1,35,826 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలను 97,963 మంది విద్యార్థులు రాశారు.
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.
Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.
Step 3 : 'డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు- 2025' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : మార్కుల మెమో పొందడానికి మీ 'హాల్ టికెట్' నెంబర్‌ను నమోదు చేయాలి.
Step 5 : PDF రూపంలో ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.