AP Inter Results 2025 : ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు వచ్చేశాయ్ - మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి-ap inter 1st year and 2nd year results 2025 released check your score with this direct links ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Inter Results 2025 : ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు వచ్చేశాయ్ - మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి

AP Inter Results 2025 : ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు వచ్చేశాయ్ - మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి

AP Inter 1st Year 2nd Year Results 2025 : ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్ ను ప్రకటించారు. పరీక్ష రాసిన విద్యార్థులు HT తెలుగు వెబ్ సైట్ లో వేగంగా చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ లోనూ అందుబాటులో ఉన్నాయి.

ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 విడుదల

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయ్..! శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్ ను విడుదల చేశారు. పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు…హిందుస్తామ్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ తో పాటు ఏపీ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈసారి సరికొత్తగా వాట్సాప్ (మన మిత్ర నెంబర్) లోనూ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 10,17,102 మంది పరీక్షలకు హాజరయ్యారు.

HT తెలుగులో సులభంగా పొందండి ఇలా…

హిందుస్తామ్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో ఇంటర్ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ (ఒకేషనల్ తో సహా) రిజల్ట్స్ ను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన డైరెక్ట్ లింక్స్ కింద ఇవ్వటం జరిగింది…..

విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు. అలాగే, మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కి "Hi" మెసేజ్ పంపితే కూడా ఫలితాలను పొందవచ్చు.

పెరిగిన ఉత్తీర్ణత శాతం:

ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందైంది.మొదటి సంవత్సరం విద్యార్థులకు 70 శాతం, రెండో సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 83గా నమోదైంది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదైంది. ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47 శాతంగా ఉంది. ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతంగా ఉంది.

జిల్లాల వారీగా ఫస్ట్ ఇయర్ వివరాలు:

ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా... 82 శాతంతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలించింది.ఇంటర్ ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా... 82 శాతంతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలించింది. 81 శాతంతో ఎన్టీఆర్ జిల్లా, 79 శాతంతో విశాఖ జిల్లా నాల్గొ స్థానంలో నిలిచింది.

ఆ తర్వాతి స్థానాల్లో తూర్పు గోదావరి, మన్యం, నెల్లూరు, కర్నూల్, తిరుపతి, ఎలూరు, పశ్చిమ గోదావరి, విజయనగరం, పల్నాడు, బాపట్ల, కాకినాడ, కోనసీమ, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, అనకాపల్లి, వైఎస్ఆర్, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అల్లూరు జిల్లాలు ఉన్నాయి. 54 శాతం ఉత్తీరణత శాతంతో ఈసారి చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

జిల్లాల వారీగా సెకండ్ ఇయర్ వివరాలు:

ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 93 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా టాప్ లో ఉంది. 91 శాతంతో గుంటూరు జిల్లా సెకండ్ స్థానంలో ఉండగా…89 శాతంతో ఎన్టీఆర్ జిల్లా ఉంది. 73 శాతంలో అల్లూరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

ఇక ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలదే హవా కొనసాగింది. మొదటి సంవత్సరం బాలికల ఉత్తీర్ణత 71 శాతంగా ఉంటే బాలుర ఉత్తీర్ణత.. 64 శాతంగా నమోదైంది. ఇక రెండవ సంవత్సరం బాలికల ఉత్తీర్ణత 81 శాతంగా ఉంటే బాలుర ఉత్తీర్ణత.. 75 శాతంగా ఉంది. వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం 71 శాతంగా ఉంది.

ఈ ఏడాదికి సంబంధించిన ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి 20వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. పది లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎగ్జామ్స్ పూర్తైన వెంటనే వెంటనే ఇంటర్ బోర్డు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 25 కేంద్రాల్లో మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కాగా… మొత్తం 4 విడుతల్లో పూర్తి చేసింది. కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా పూర్తి కావటంతో ఇవాళ (ఏప్రిల్ 12) ఫలితాలను విడుదల చేశారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.