ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే-ap icet results 2025 out direct link to check scorecard rank card ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

ఏపీ ఐసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులను ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ICET/ వెబ్ సైట్ లో తనిఖీ చేసుకోవచ్చు.

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

ఏపీ ఐసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్ నిర్వహించారు. ఐసెట్ ఫలితాలను ఆంధ్ర యూనివర్సిటీ వీసీ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు.

మే 7న రాష్ట్రంలోని 94 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ నిర్వహించారు. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేశారు. తాజాగా ఐసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఐసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ICET/ ఈ లింక్ లో తెలుసుకోవచ్చు.

"ఏపీ ఐసెట్ లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు. ఫలితాలు ఇప్పుడు https://cets.apsche.ap.gov.in/ICET , WhatsApp గవర్నెన్స్ నం. 9552300009 లో అందుబాటులో ఉన్నాయి.34,131 మంది విద్యార్థులలో 32,719 మంది(95.86%) విద్యార్థులు ఐసెట్ పరీక్షలో అర్హత సాధించారు. మీ ఉజ్వల విద్యా భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు" - మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్హెచ్ఈ ద్వారా ఏపీ ఐసెట్ 2025 ను నిర్వహించే బాధ్యతను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పగించింది. ఈ పరీక్షను మే 7న రాష్ట్రంలోని 93 పరీక్షా కేంద్రాలలో, హైదరాబాద్ లోని ఒక కేంద్రంలో రెండు సెషన్‌లలో నిర్వహించారు.

వెబ్ సైట్ లో ర్యాంక్ కార్డులు

ఏపీ ఐసెట్ లో అర్హత సాధించిన విద్యార్థులు వెబ్‌సైట్ నుండి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ఐసెట్ 2025 పరీక్ష తర్వాత ప్రిలిమినరీ కీని మే 10, 2025న విడుదల చేశారు. కీ పై అభ్యంతరాలను మే 12, 2025 సాయంత్రం 5 వరకు స్వీకరించారు. నిపుణుల బృందం జాగ్రత్తగా మూల్యాంకనం చేసిన తర్వాత, తుది కీలను తయారు చేశారు. తుది కీల ఆధారంగా ఫలితాలను ప్రాసెస్ చేశారు.

ఐసెట్ వివరాలు

➢ AP ICET-2025 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మొత్తం సంఖ్య- 37572

➢ AP ICET-2025కి హాజరైన అభ్యర్థుల మొత్తం సంఖ్య- 34131

➢ AP ICET-2025లో అర్హత సాధించిన అభ్యర్థుల మొత్తం సంఖ్య- 32719

➢ AP ICET-2025లో పరీక్షా కేంద్రాల సంఖ్య- 94

➢ అర్హత సాధించిన అభ్యర్థుల శాతం: 95.86%

టాపర్లు వీరే

  1. మేకా మనోజ్ - మొదటి ర్యాంక్ - 197.91 మార్కులు
  2. డి.సందీప్ రెడ్డి- రెండో ర్యాంక్ -179.51 మార్కులు
  3. ఎస్. కృష్ణ సాయి- మూడో ర్యాంక్-178.51 మార్కులు
  4. వల్లూరి. సాయిరామ్ సాత్విక్ -నాలుగో ర్యాంక్ -175.69 మార్కులు
  5. రావూరి. మాధుర్య- 5వ ర్యాంక్-175.45

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం