AP ICET 2025 Registration : ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి(APSCHE) ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 13, 2025 నుంచి ఏపీ ఐసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025(AP ICET 2025)కి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 9, 2025 చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ 30, 2025 వరకు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది.
ఏపీ ఐసెట్ హాల్ టికెట్‌లను మే 2, 2025 నుంచి అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షను రెండు షిప్టులలో మే 7, 2025న జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి 11.30 వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహిస్తారు. సెక్షన్-బి పరీక్ష ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే జరుగుతుంది. సెక్షన్ A & సెక్షన్ C పరీక్ష ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాలలో జరుగుతుంది.
ఏపీ ఐసెట్ కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింద దశలను అనుసరించవచ్చు.
1. ఏపీ ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ పై క్లిక్ చేయండి.
2. హోమ్ పేజీలో ఉన్న నాలుగు దశలను ఫాలో అవ్వండి.
3. అభ్యర్థులు ముందుగా "Step-1-Eligibility Criteria And Free Payment " పై క్లిక్ చేసి ప్రాథమిక వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించాలి.
4. ఫీజు చెల్లించిన తర్వాత "Step 2 - Know Your Payment Status for AP ICET - 2025" క్వాలిఫైయింగ్ పరీక్ష హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ నమోదు చేసి ఫీజు చెల్లింపు స్టేటస్ చెక్ చేసుకోవాలి.
5. "Step 3- Application Form for AP ICET - 2025" లో పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, క్వాలిఫైయింగ్ పరీక్ష హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ , పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి దరఖాస్తును పూర్తి చేయాలి.
6. "Step 4 Print Application Form for AP ICET - 2025" అభ్యర్థి దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత పేమెంట్ ఐడీ, రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ , క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ తో అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
7. తదుపరి అవసరం కోసం అప్లికేషన్ హార్డ్ కాపీని భద్రపరుచుకోండి.
ఏపీ ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ. 650, బీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు రూ. 550గా నిర్ణయించారు.
2025-26 విద్యా సంవత్సరానికి ఏపీలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు అందించే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఐసెట్ ను నిర్వహిస్తుంది.
సంబంధిత కథనం