AP SSC Exams 2025 : టెన్త్ ఎగ్జామ్స్ రాసే దివ్యాంగ విద్యార్థులకు గుడ్ న్యూస్ - ప్రత్యేక మినహాయింపులకు అనుమతి
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులు కల్పించింది. పరీక్ష రాసేందుకు సహాయకుల నియామకానికి అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని చాలా మంది దివ్యాంగ విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
దివ్యాంగ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే దివ్యాంగ విద్యార్థులకు నిబంధనలను సడలించింది. దీంతో పాటు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. ఈ మినహాయింపులతో దివ్యాంగ విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పరీక్షలు రాసేందుకు సహాయకులను నియమించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు మరిన్ని మినహాయింపులను ఇవ్వనుంది. దీనివల్ల వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బుద్ధిమాంద్యం, ఎదుగుదల లోపం, మస్తిష్క పక్షవాతం వంటి శాశ్వత అనారోగ్యాలు ఉన్న దివ్యాంగ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా మినహాయింపు అమలు చేయనున్నారు.
దివ్యాంగ విద్యార్థులకు సౌకర్యాలు, మినహాయంపులు :
1. వినికిడి సమస్య ఉన్నవారికి మినహా మిగతా అన్ని రకాల అంగ వైకల్యం ఉన్న విద్యార్థులు పరీక్షల్లో స్త్కైబ్ పేరుతో సహాయకుడిని ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతి అనుమతి ఇస్తారు.
2. ఎముకల బలహీనత ఉన్నవారికి సహాయకుడితో పాటు బల్ల, కుర్చీలను కేటాయిస్తారు.
3. విద్యార్థులకు ఎనిమిది విభాగాల్లో ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా తగ్గించారు.
4. పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు (మూల్యాంకనం) సమాధాన పత్రాల్లో వ్యాకరణ దోషాలు, వాక్య నిర్మాణ లోపాలపై పట్టింపు లేకుండా సడలించారు.
5. కాలిక్యులేటర్లు, జామెట్రీ బాక్సులు వంటి పరీక్షలకు అమసరైమన పరికరాల వినియోగంపై ఆంక్షలు తొలగించారు.
6. అంధత్వం (కళ్లు కనిపించనివారికి) ఉన్న వారికి ఉత్తీర్ణత సాధించే మార్కులు 35 నుంచి 20కి తగ్గించారు.
7. వినికిడి (చెవిటి) లోపం ఉన్నవారు తెలుగు, హిందీ, ఆంగ్లంలో ఏదైనా ఒక సబ్జెక్టు పరీక్షలు రాస్తే సరిపోయేలా వెసులుబాటు కల్పించింది.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్:
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
- మార్చి 17న (సోమవారం) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -1.
- మార్చి 19 (బుధవారం) సెకండ్ లాంగ్వేజ్.
- మార్చి 21 (శుక్రవారం) ఇంగ్లీష్.
- మార్చి 22 (శనివారం) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1.
- మార్చి 24 (సోమవారం) మ్యాథమెటిక్స్.
- మార్చి 26 (బుధవారం) ఫిజికల్ సైన్స్.
- మార్చి 28 (శుక్రవారం) బయోలాజికల్ సైన్స్ పరీక్ష.
- మార్చి 29 (శనివారం) ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2, ఎస్‌సీసీ ఒకేషనల్ కోర్సు.
- ఏప్రిల్ 1 (మంగళవారం) సోషల్ స్టడీస్.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం