AP Teachers Posts : ఏపీలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు, డీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ ప్రక్రియ
AP Teachers Posts :ఏపీలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ జీవోలు జారీ చేసింది.
AP Teachers Posts : ఏపీలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డీఎస్సీ ద్వారా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మరో 2,260 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి.
ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో నెంబర్ 13, జీవో నెంబర్ 12ని విడుదల చేశారు. 2021 అక్టోబర్ 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, 2025 మార్చి 7న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల్లో 1,136 ఎస్‌జీటీ, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పాఠశాల విద్యా డైరెక్టర్ తదనుగుణంగా తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోస్టులను డీఎస్సీ ద్వారా నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు
ఉమ్మడి జిల్లాల వారీగా ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌జీటీ పోస్టులను ప్రైమరీ లెవల్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ లెవల్‌గా పరిగణిస్తారు.
1. అనంతపురం -ఎస్‌జీటీ పోస్టులు-101, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-100
2. చిత్తూరు- ఎస్‌జీటీ పోస్టులు-117, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-82
3. తూర్పుగోదావరి- ఎస్‌జీటీ పోస్టులు-127, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-151
4. గుంటూరు- ఎస్‌జీటీ పోస్టులు-151, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-98
5. వైఎస్ఆర్ కడప -ఎస్‌జీటీ పోస్టులు-57, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-49
6. కృష్ణా- ఎస్‌జీటీ పోస్టులు-71, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-89
7. కర్నూలు -ఎస్‌జీటీ పోస్టులు-110, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-130
8. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు - ఎస్‌జీటీ పోస్టులు-63, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-44
9. ప్రకాశం- ఎస్‌జీటీ పోస్టులు-74, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-50
10. శ్రీకాకుళం- ఎస్‌జీటీ పోస్టులు-71, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-109
11. విశాఖపట్నం -ఎస్‌జీటీ పోస్టులు-59, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-52
12. విజయనగరం- ఎస్‌జీటీ పోస్టులు-45, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-66
13. పశ్చిమ గోదావరి- ఎస్‌జీటీ పోస్టులు-90, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-105
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం