ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలింది. అయిదే ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 4 కేంద్రీయ విద్యాలయాలు వస్తున్నాయి. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలింది. మెుత్తం అన్నింటి నిర్మాణం కోసం కేంద్రం రూ.5,863 కోట్లు కేటాయించనుందని ప్రభుత్వం.
చిత్తూరు జిల్లాల్లోని మంగసముద్రం, కుప్పం మండలంలోని బైరుగానిపల్లె, శ్రీకాకుళం జిల్లా పలాస, రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామాలు ఉన్నాయి. వీటిలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా, మూడు ఏళ్ల ప్రాథమిక ప్రీ-ప్రైమరీ తరగతులైన బాల్వటికలను కలిగి ఉంటాయి.
ఏపీకి కేటాయించిన కేంద్రీయ విద్యాలయాలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. వీటితో గ్రామీణ ప్రాంతా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు గతేడాది కూడా 8 కేంద్రీయ విద్యాలయాలు కేటాయించినట్టుగా తెలిపారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తుందన్నారు. ఏపీలో ఇప్పటికే 38 కేంద్రీయ విద్యాలయాలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రానికి నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాల్ని కేటాయించడంపై ప్రధాని మోదీకి చంద్రబాబు థాంక్స్ చెప్పారు. 'నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాల (కేవీఎస్) స్థాపనకు ఆమోదం తెలిపింది: మంగసముద్రం (చిత్తూరు), బైరుగనిపల్లె (కుప్పం మండలం, చిత్తూరు), పలాస (శ్రీకాకుళం), శాఖమురు (అమరావతి). ప్రధానమంత్రి, కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ జీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చొరవ రాష్ట్రంలో గతంలో సేవలు అందని ప్రాంతాలలో నాణ్యమైన విద్యను పొందే అవకాశాన్ని గణనీయంగా పెంచుతుంది, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గణనీయంగా ఉన్న ప్రాంతాల అవసరాలను కూడా తీరుస్తుంది.' అని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.