AP Forest Jobs : ఏపీ అటవీ శాఖ ఉద్యోగాలపై అప్డేట్, 6 నెలలో భర్తీ చేస్తామని చీఫ్ కన్జర్వేటర్ ప్రకటన
AP Forest Jobs : ఏపీ అటవీశాఖలోని 689 ఖాళీలను రానున్న ఆరు నెలల్లో భర్తీ చేస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి తెలిపారు. రేంజ్, సెక్షన్, బీట్ అధికారులను ఏపీపీఎస్సీ భర్తీ చేయనుందని చెప్పారు.

AP Forest Jobs : ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఖాళీలను వచ్చే ఆరు నెలల్లో భర్తీ చేస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి తెలిపారు. అటవీశాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. రేంజ్, సెక్షన్, బీట్ అధికారులను ఏపీపీఎస్సీ భర్తీ చేయనుందని చెప్పారు. రాష్ట్రంలోని 50 ప్రాంతాల్లో రూ.50 కోట్లతో ఎకో టూరిజం అభివృద్ధి చేసి 4 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.
175 నియోజకవర్గాల్లో నగర వనాలు
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో నిన్న మీడియాతో మాట్లాడిన చిరంజీవి... అటవీ శాఖ పట్టుకున్న 905 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని త్వరలోనే విక్రయిస్తామని ప్రకటించారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.350 కోట్ల రాబడి వస్తుందని అంచనా ఉందన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నగర వనాలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇప్పటికే 61 చోట్ల పనులు ప్రారంభించామన్నారు. మరో 12 నగర వనాల మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు స్పష్టం చేశార. మిగిలిన నియోజకవర్గాల్లో భూసేకరణకు చర్యలు చేపట్టామన్నారు.
మొత్తం ఖాళీలు : 689
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్- 175
- ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్- 37
- ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్- 70
- అసిస్టెంట్ బీట్ ఆఫీసర్- 375
- జూనియర్ అసిస్టెంట్- 10
- థానేదార్- 10
- టెక్నికల్ అసిస్టెంట్- 12
కడప యురేనియం కార్పొరేషన్ లో అప్రెంటీస్ పోస్టులు
కడప యురేనియం కార్పొరేషన్‌లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), టర్నర్/ మెషినిస్ట్, మెకానికల్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ ట్రేడ్లలో 32 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..
ఫిట్టర్ -9, ఎలక్ట్రీషియన్ -9, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) -4, టర్నర్ / మెషినిస్ట్ -3, మెకానికల్ డీజిల్ -3, కార్పెంటర్ -2, ప్లంబర్ -2 మొత్తం 32 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
అర్హతలు
పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. ఆయా ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల్లో అప్రెంటిస్ చేరిన వారు దరఖాస్తు దాఖలు చేసేందుకు అనర్హులు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. తొలిత వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ టాబ్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవుతోంది.
అప్లికేషన్‌లో అడిగిన వివరాలు పొందుపరచాలి. అనంతరం రిజిస్ట్రార్ ఈ మెయిల్ ఐడీ కన్ఫ్మేషన్ మెయిల్ వస్తుంది. అభ్యర్థి ఈ మెయిల్‌లో ఐడీలో లింక్‌ను క్లిక్ చేసి లాగ్ ఇన్ అవ్వాలి. అప్పుడు మళ్లీ అందులో అడిగిన వివరాలు పొందుపరచాలి.
సంబంధిత కథనం