APSFL Recruitment 2025 : ఏపీ ఫైబర్‌నెట్‌లో జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
APSFL Recruitment 2025 Updates: ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన వారు ఆన్ లైన్ ద్వారా జనవరి 31వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్)లో జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. దరఖాస్తు దాఖలు చేసేందుకు జనవరి 31 ఆఖరు తేదీగా నిర్ణయించారు. దరఖాస్తును ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులను కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. విజయవాడ కేంద్ర పని చేయాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు…
ఈ నోటిఫికేషన్ లో భాగంగా జనరల్ మేనేజర్-2 ఉద్యోగాలను, అసిస్టెంట్ జనరల్ మేనేజర్-1 పోస్టును భర్తీ చేస్తున్నారు. జనరల్ మేనేజర్ పోస్టులకు సంబంధించి జనరల్ మేనేజర్ (సోర్సింగ్ & ప్రోక్యూరిమెంట్), జనరల్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్ అండ్ హూమన్ రిసోర్స్) ఉన్నాయి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుకు సంబంధించి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఖాళీ ఉంది.
అనుభవం...అర్హతలు
1. జనరల్ మేనేజర్ పోస్టులకు ఆయా విభాగాల్లో 15 ఏళ్ల అనుభవం ఉండాలి. విద్యా అర్హతలు రెండు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి.
- జనరల్ మేనేజర్ (సోర్సింగ్ & ప్రోక్యూరిమెంట్)కు అగ్రశ్రేణి సంస్థ నుండి సప్లై చైన్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా సంబంధిత రంగంలో మాస్టర్స్ డిగ్రీ అయినవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- జనరల్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్ అండ్ హూమన్ రిసోర్స్)కు ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్ ఇన్స్టిట్యూట్ నుండి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ లేదా సంబంధిత రంగంలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుకు 12 ఏళ్ల పైబడి అనుభవం ఉండాలి. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నుండి చార్టర్డ్ అకౌంటెంట్ (CA / CMA / ICWAI లేదా MBA ఫైనాన్స్) పూర్తి చేసి ఉండాలి.
ఈ పోస్టులకు 18 నుండి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్లూఎస్ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు. జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.45 వేలు వరకు జీతం ఉంటుంది. పోస్టులను బట్టీ వేతనాలు ఉంటాయి. అలాగే ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు
1. సీఏ, సీఎంఏ, ఐసడబ్ల్యూఏ, ఎంబీఏ ఫైనాన్స్, మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్లు
2. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
3. కుల ధ్రువీకరణ పత్రం
పూర్తి వివరాలు ఇందులో...
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://apsfl.in/careers.php ద్వారా తెలుసుకోవచ్చు. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే ఒక్కో పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి. apsfl@ap.gov.in మెయిల్ కు దరఖాస్తు పంపాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం