ఏపీలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉండటంతో… అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఏపీ ఎడ్‌సెట్ 2025ను గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం నిర్వహిస్తోంది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా.. 2025- 26 విద్యా సంవత్సరానికి గానూ బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఏపీ ఎడ్ సెట్ 2025కు దరఖాస్తులను ఆన్‌లైన్ పద్ధతిలో స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం జనరల్ అభ్యర్థులు రూ.650, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.450 ఆన్‌లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక రూ.1000 గడువుతో మే 19వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
ఇక రూ.2 వేల ఆలస్య రుసుంతో మే 24 వరకు, రూ.4 వేలతో మే 26 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రూ.10 వేల ఫైన్ తో మే 27 నుంచి జూన్ 3 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. మే 30 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. జూన్ 5వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది.