ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు వచ్చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 5 విభాగాల్లో కలిపి మొత్తం 99.42 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. మొత్తం 17,795 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 14,527 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఏపీ ఎడ్ సెట్ రిజల్ట్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలు కింది విధంగా ఉంటాయి….
Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.
Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.
Step 3 : 'ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు - 2025' పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేష్ నెంబర్ ను నమోదు చేయాలి.
Step 4 : సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్లే అవుతుంది.
ఏపీ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మినహా మిగిలిన అభ్యర్థులందరికీ 150 మొత్తం మార్కులకు 37 మార్కులు (అంటే 25%) అర్హత మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ర్యాంకింగ్ కోసం ఎటువంటి అర్హత మార్కులు లేవు. ఫిజికల్ సైన్సెస్ / మ్యాథమెటిక్స్ మెథడాలజీలలో మహిళలకు కనీస అర్హత మార్కులు వర్తించవు.