APEDB Jobs : ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు జీతాలు లక్షల్లో ఉంటాయి. ఐదు విభాగాల్లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు పోస్టులకు నియామకాలు చేపడతారు. మొత్తం 22 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా జీవో నెంబర్ 526ను విడుదల చేశారు.
మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తారు. అందులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్-5, జనరల్ మేనేజర్-10, మేనేజర్-7 పోస్టులను భర్తీ చేయనున్నారు.
1. ఇన్వెస్ట్‌మెంట్ ప్రొమోషన్ విభాగం : అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్- 4 (ఎలక్ట్రానిక్స్-1, ఐటీ -1, ఏరో స్పెస్-1, ఫుడ్ ప్రాసెసింగ్-1)
2. ఇన్వెస్ట్‌మెంట్ ప్రొమోషన్ విభాగం : జనరల్ మేనేజర్- 8 (ఆటోమొబైల్-1, ఫార్మా-1, టెక్స్‌టైల్-1, ఇండస్ట్రీయల్ పార్క్-1, కెమికల్ అండ్ పెట్రో కెమికల్-1, రెనెవబుల్ ఎనర్జీ-1, జనరల్ మ్యాన్‌ఫాక్చరింగ్-2)
3. ఇన్వెస్ట్‌మెంట్ ప్రొమోషన్ విభాగం : మేనేజర్- 3 (ఆటోమొబైల్-1, ఎలక్ట్రానిక్స్-1, ఫార్మా-1 )
4. ఎక్స్‌ట్రనల్ ఎంగేజ్‌మెంట్ విభాగం : జనరల్ మేనేజర్-2 (యూఎస్, జర్మనీ, ఫ్రాన్స్, కొరియా, జపాన్, తైవాన్ దేశాలపై ఫోకస్ చేయాలి)
5. హెచ్ఆర్ అండ్ అడ్మిన్ విభాగం : అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (బిల్డింగ్ అండ్ ఇంప్లెమెంటింగ్ హెచ్ఆర్ పాలసీలు, నియామక ప్రక్రియను స్ట్రీమిలిటింగ్‌లో అనుభవం ఉండాలి. )- 1,
6. హెచ్ఆర్ అండ్ అడ్మిన్ విభాగం : మేనేజర్ (ఆఫీస్ ట్రావెల్ డస్క్, ఓవరల్ అడ్మినిస్ట్రేషన్)- 1
7. పాలసీ అండ్ లీగల్ విభాగం : మేనేజర్ (స్టేట్, సెంట్రల్ నోటిఫికేషన్లను రివ్యూ చేయాలి. ఎంవోయు డాక్యుమెంట్ల తయారీ, పాలసీల రివ్యూ, కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ రివ్యూ)- 1
8. గ్రాఫిక్ డిజైన్ (స్టాటిక్ అండ్ వీడియో) : మేనేజర్ (డిజైనింగ్ ప్రజంటేషన్, న్యూస్ లెటర్స్, డాక్యుమెంట్ల ఫార్మెటింగ్, క్రియేటింగ్ స్టాటిక్ అండ్ వీడియో కంటెంట్)- 2
వేతనాలు
1. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు నెలకు రూ.2,50,000 నుంచి రూ.5,00,000 ఉంటుంది.
2. జనరల్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.2,00,000 నుంచి రూ.2,50,000 ఉంటుంది.
3. మేనేజర్ పోస్టులకు నెలకు రూ.1,50,000 నుంచి రూ.2,00,000 ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. నియామకాలను సెలక్షన్ కమిటీ చేపడుతుందని తెలిపారు. ఆయా విభాగాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఏపీఈడీబీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం