ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి-ap ecet result 2025 out download scorecard rank card ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఈసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఈసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ లో ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అనంతపురం జేఎన్టీయూ నిర్వహించిన ఈసెట్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. మొత్తం 35,187 మంది పరీక్షలకు హాజరవ్వగా…31,922 మంది ఉత్తీర్ణులయ్యారు.

డిప్లమా, బీఎస్సీ(గణితం) డిగ్రీ విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ సెకండియర్ చేరేందుకు ఈసెట్ నిర్వహిస్తారు. మే 6న నిర్వహించిన ఈసెట్ ఫలితాలు తాజాగా విడుదల అయ్యాయి.

ఏపీ ఈసెట్ ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు అమ్మాయి గంగా భవాని బీఎస్సీ(గణితం) విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది.

లేటరల్ ఎంట్రీ విధానంలో

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈసెట్ లో అర్హత సాధించిన వారికి పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్య్ అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.

ఏపీ ఈసెట్-2025 పరీక్షను మే 6న నిర్వహించారు. రెండు విడతలుగా ఏపీ ఈసెట్ పరీక్షను జేఎన్టీయూ నిర్వహించింది. మే 6వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 12:00 వరకు, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి.

ఏపీ ఈసెట్ మొత్తం 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో కూడా ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. ఏపీ ఈసెట్ పరీక్షకు మొత్తం 35,187 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31,922 మంది అర్హత సాధించారు.

ఏపీ పాలిసెట్ ఫలితాలు

ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. మంత్రి లోకేశ్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు https://polycetap.nic.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

అల్లూరి జిల్లా టాప్

  1. పాలిసెట్ ఫలితాల్లో అల్లూరి జిల్లా 98.66% అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసింది. 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించారు.
  2. వాట్సాప్ (మన మిత్ర): 9552300009 కు "హాయ్" అని పంపి పాలిసెట్ ఫలితాలు తనిఖీ చేయవచ్చు.

మొత్తం పరీక్షకు హాజరైన విద్యార్థులు -1,39,840

  • ఉత్తీర్ణులైన విద్యార్థులు -1,33,358
  • మొత్తం ఉత్తీర్ణత శాతం -95.36%
  • బాలుర ఉత్తీర్ణత - 80,334 (94.38%)
  • బాలికల ఉత్తీర్ణత- 53,024 (96.90%)

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం