బీటెక్ సెకండ్ ఇయర్ లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు. ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు….. జూలై 4 నుంచి ఫీజు చెల్లించుకోవచ్చు. జూలై 13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.
ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలను అనంతపురం జేఎన్టీయూ చూస్తోంది. ఈ ఏడాది మొత్తం 35,187 మంది పరీక్షలకు హాజరవ్వగా…31,922 మంది ఉత్తీర్ణులయ్యారు. డిప్లమా, బీఎస్సీ(గణితం) డిగ్రీ విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ సెకండియర్ చేరేందుకు ఈసెట్ నిర్వహిస్తారు. మే 6వ తేదీన ఈ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ ఈసెట్ ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు అమ్మాయి గంగా భవాని బీఎస్సీ(గణితం) విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది.
ఈసెట్ లో అర్హత సాధించిన వారికి పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్య్ అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ర్యాంకులతో పాటు రిజర్వేషన్లు ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
సంబంధిత కథనం