AP ECET 2025 : ఏపీ ఈసెట్-2025.. మరికొన్ని గంటలే గడువు.. దరఖాస్తు చేసుకున్నారా? ఇలా ట్రై చేయండి-ap ecet 2025 registration without late fee ends today ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Ecet 2025 : ఏపీ ఈసెట్-2025.. మరికొన్ని గంటలే గడువు.. దరఖాస్తు చేసుకున్నారా? ఇలా ట్రై చేయండి

AP ECET 2025 : ఏపీ ఈసెట్-2025.. మరికొన్ని గంటలే గడువు.. దరఖాస్తు చేసుకున్నారా? ఇలా ట్రై చేయండి

AP ECET 2025 : ఏపీ ఈసెట్-2025 కి సంబంధించి కీలక అప్‌డేట్ ఇది. ఇవాళ్టితో లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ముగుస్తోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తొందరగా దరఖాస్తు చేసుకోవాలని.. అధికారులు సూచిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా చాలా సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

ఏపీ ఈసెట్ 2025

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి.. బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈసెట్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2025 ద్వారా.. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథ్స్) అభ్యర్థులకు లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవాళ్టితో గడువు ముగుస్తోంది..

ఈ ఏడాది ఏపీ ఈసెట్‌ను అనంతపురం జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. లేట్ ఫీజు లేకుండా ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగుస్తోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని.. అధికారులు సూచిస్తున్నారు.

దరఖాస్తు ఇలా..

1.అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ఓపెన్ చేయాలి.

2.పేజీ చివర్లో ఏపీ ఈసెట్- 2025 కాలమ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

3.కొత్త విండో ఓపెన్ అవుతుంది. స్టెప్-1 లో ఎలిజిబులిటి క్రైటీరియా, ఫీజు పేమెంట్ ఉంటుంది.

4.రెండో స్టెప్‌లో పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

5.మూడో స్టెప్‌లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. (ఫీజు చెల్లించాకే అనుమతి వస్తుంది)

6.ఇక ఆఖరుగా స్టెప్-4 లో అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేశాకే ప్రింట్ వస్తుంది.

మే 6న పరీక్ష..

మే 6వ తేదీన ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఏపీ ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సు, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తి చేసిన విద్యార్థులకు బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో అడ్మిషన్ కల్పిస్తారు.

అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయో టెక్నాలజీ, సెరామిక్‌ టెక్నాలజీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు, మెటలర్జికల్‌, ఇన్‌ స్ట్రుమెంటేషన్‌, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా.. అధికారిక వెబ్‌సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.