AP EAPCET Free Tests 2025 : ఏపీ ఈఏపీసెట్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? వెబ్ సైట్ లో ‘మాక్ టెస్ట్’ ఆప్షన్ - ఇలా రాసుకోవచ్చు
AP EAPCET 2025 Updates : ఏపీ ఈఏపీసెట్ కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఎంట్రెన్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారికి అధికారులు కీలక అప్జేట్ ఇచ్చారు. ఉచితంగా మాక్ టెస్ట్ లు రాసుకునే అవకాశం కల్పించారు. ఏపీఈఏపీసెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని రాసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి....
ఏపీ ఈఏపీసెట్ కు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఎలాంటి ఆపరాద రుసుం లేకుండా ఏప్రిల్ 24వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అయితే రూ. 1000 ఆపరాద రుసుంతో మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ. 2 వేల ఆపరాద రుసుంతో మే 7 వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రూ.10 వేల అపరాధ రుసుంతో మే 16 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే... అభ్యర్థులకు అధికారులు అలర్ట్ ఇచ్చారు. ఉచితంగా మాక్ టెస్టులు రాసుకునే అవకాశం కల్పించారు. ఏపీఈఏపీసెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఇంజినీరింగ్, ఫార్మసీ స్ట్రీమ్ విద్యార్థులు... ఈ పరీక్షలను ఉచితంగా రాసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ చూడండి.....
ఏపీ ఈఏపీసెట్ 2025 మాక్ టెస్టులు రాసే విధానం:
- ఏపీ ఈఏపీసెట్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో Mock Test అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఇంజినీరింగ్ స్ట్రీమ్ మరియు అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
- మీరు ఏ స్ట్రీమ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ లింక్ పై క్లిక్ చేయాలి. అలా చేస్తే సైన్ ఇన్ ఆప్షన్ వస్తుంది. దానిపై కూడా క్లిస్ చేస్తే… మీకు ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది.
- ఇలా ఎన్నిసార్లైనా ఈ పరీక్షలు రాసుకోవచ్చు. ఈ మాక్ పరీక్షల ద్వారా... ఓ అవగాహనకు రావొచ్చు.
మే 12 నుంచి హాల్ టికెట్లు….
మే 6 నుంచి 8వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. మే 12వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా వీటిని పొందవచ్చు.
వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష మే 19, 20 తేదీల్లో జరుగుగుతుంది. రోజుకు రెండు విడతలుగా ఉంటుంది. ఇంజినీరింగ్ పరీక్ష మే 21 నుంచి 27 వరకు రోజుకు రెండు విడతలుగా నిర్వహిస్తారు.
వ్యవసాయ, ఫార్మసీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని మే 21న వెల్లడించారు. ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’ని మే 28న విడుదల చేస్తారు. తుది ‘కీ’ని జూన్ 5న ప్రకటిస్తారు. ఆన్ లైన్ విధానంలో పరీక్షలు ఉంటాయి. ఇందుకోసం ఏపీ(46), తెలంగాణలో(02) కలిపి మొత్తం 48 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.