ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షురూ అయింది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు…. ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకు కేవలం ఈ ఒక్క రోజే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అక్టోబర్ 21వ తేదీన మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. https://eapcet-sche.aptonline.in/EAPCETAGR/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఇందులో భాగంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగం పరీక్ష రాసిన ఇంటర్ బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను కేటాయిస్తారు. మొత్తం 2 విడతల్లో సీట్ల భర్తీని పూర్తి చేస్తారు. ఇందులో బీ ఫార్మసీ, ఫార్మా డి, బీటెక్ బయోటెక్నాలజీ, పుడ్ టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సులున్నాయి. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు రేపు, ఎల్లుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇక ఈనెల 18న వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఈనెల 21వ తేదీన సీట్ల కేటాయిస్తారు. ఇక సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 24లోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి.
ఇక ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ ఫైనల్ ఫేజ్ ప్రక్రియ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు ఈనెల 29 వరకు అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలను https://eapcet-sche.aptonline.in/EAPCETAGR/ వెబ్ సైట్ లో చూడొచ్చు. రిజిస్ట్రేషన్ తో పాటు ప్రాసెస్ ఫీజు కూడా చెల్లించుకోవచ్చు.
సంబంధిత కథనం