ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వివరాలను వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలను నిర్వహించారు. పరీక్ష రాసిన విద్యార్థులు ఏపీఈఏపీసెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఈసారి అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కు 81,837 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 75460 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 89.8 శాతం క్వాలిఫై అయ్యారు.
ఇక ఇంజినీరింగ్ స్టీమ్ లో చూస్తే… 2,80,611 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,64,840 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,89,748 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తంగా 71.65 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో మొదటి ర్యాంకర్ గా అనిరుధ్ రెడ్డి నిలిచారు. రెండో ర్యాంకర్ గా భాను రెడ్డి, మూడో ర్యాంకర్ గా యస్వంత్ సాధ్విక్ ఉన్నారు.
ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు మే 19 నుంచి మే 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహించారు. మే21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరిగాయి. మే 27న అగ్రికల్చర్, ఫార్మసి ప్రాథమిక కీని విడుదల చేశారు. మే 28వ తేదీన ఇంజినీరింగ్ ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. మే 30వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. దీంతో ఫలితాలను ఇవాళ విడుదల చేశారు.
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా ఏపీ ఈఏపీసెట్ -2025 ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.
Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.
Step 3 : ' ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు- 2025' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : 'హాల్ టికెట్' నెంబర్ తో పాటు రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేయాలి.
Step 5 : PDF రూపంలో ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రిజర్వేషన్లను కూడా ప్రమాణికంగా తీసుకుంటారు. ఫలితాల వెల్లడించిన నేపథ్యంలో… త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విడతల వారీగా సీట్లను కేటాయిస్తారు. సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ కు అవకాశం ఇస్తారు. దీనిపై ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంటుంది.