ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే-ap eapcet 2025 counselling schedule released key dates check here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

ఏపీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూలై 4వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూలై 7 నుంచి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జూలై 22వ తేదీన సీట్లను కేటాయిస్తారు.

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ - 2025

ఏపీ ఈఏపీసెట్ - 2025 అభ్యర్థులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఇందులో భాగంగా జూలై 4వ తేదీన పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూలై 7 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు జూలై 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూలై 22వ తేదీన సీట్లను కేటాయిస్తారు.

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల - 04.07.2025
  • రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపు తేదీలు - 07.07.2025 నుంచి 16.07.2025
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ - 07.07.2025 నుంచి 17.07.2025
  • వెబ్ ఆప్షన్ల ఎంపిక - 10.07.2025 నుంచి 18.07.2025
  • వెబ్ ఆప్షన్ల మార్పు - 19.07.2025
  • సీట్ల కేటాయింపు - 22.07.2025
  • కాలేజీల్లో రిపోర్టింగ్ - 23.07.2025 నుంచి 26.07.2025.
  • తరగతులు ప్రారంభం - 04.08.2025
  • ఈమెయిల్ ఐడీ - convenorapeapcet2025@gmail.com
  • హెల్ప్ లైన్ నెంబర్లు: 7995681678, 7995865456, 9177927677.

విద్యార్థుల వద్ద ఉండాల్సిన పత్రాలు:

  • ఏపీ ఈఏపీసెట్ ర్యాంక్ కార్డు
  • ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్
  • పదో తరగతి మెమో
  • ఇంటర్ మెమో
  • ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • టీసీ
  • ఆదాయ ధ్రువీకరణపత్రం
  • ఈడబ్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  • లోకల్ క్యాండెట్ సర్టిఫికెట్
  • రెసిడెన్స్ సర్టిఫికెట్

ఏపీ ఈఏపీసెట్ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి..

  1. పరీక్షలు రాసిన విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/EAPCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
  3. రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ తో పాటు పలు వివరాలను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మార్కులతో పాటు ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు మే 19 నుంచి మే 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహించారు. మే21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. మే 27న అగ్రికల్చర్‌, ఫార్మసి ప్రాథమిక కీని విడుదల చేశారు. మే 28వ తేదీన ఇంజినీరింగ్ ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. మే 30వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. జూన్ 8వ తేదీన ఫలితాలను విడుదల చేశారు.

ఈసారి అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కు 81,837 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 75460 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 89.8 శాతం క్వాలిఫై అయ్యారు.

ఇక ఇంజినీరింగ్ స్టీమ్ లో చూస్తే… 2,80,611 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,64,840 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,89,748 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తంగా 71.65 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ లో మొదటి ర్యాంకర్ గా అనిరుధ్‌ రెడ్డి నిలిచారు. రెండో ర్యాంకర్ గా భాను రెడ్డి, మూడో ర్యాంకర్ గా యస్వంత్‌ సాధ్విక్‌ ఉన్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం