ముగిసిన ఏపీ ఈఏపీ సెట్‌ 2025.. నేడు ఇంజనీరింగ్‌ కీ విడుదల.. 30వరకు అభ్యంతరాల స్వీకరణ-ap eapcet 2025 concludes engineering key released today objections accepted until may 30 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ముగిసిన ఏపీ ఈఏపీ సెట్‌ 2025.. నేడు ఇంజనీరింగ్‌ కీ విడుదల.. 30వరకు అభ్యంతరాల స్వీకరణ

ముగిసిన ఏపీ ఈఏపీ సెట్‌ 2025.. నేడు ఇంజనీరింగ్‌ కీ విడుదల.. 30వరకు అభ్యంతరాల స్వీకరణ

Sarath Chandra.B HT Telugu

ఏపీ ఈఏపీ సెట్‌ 2025లో ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలు ముగిశాయి. ఏపీ తెలంగాణాల్లోని 145 పరీక్షా కేంద్రాల్లో ఈఏపీ సెట్‌ నిర్వహించారు. ఇంజనీరింగ్‌ పరీక్షలకు 94.38శాతం మంది హాజరయ్యారు. బుధవారం ఉదయం కీ విడుదల చేయనున్నారు. మే 30వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.

నేడు ఏపీ ఈఏపీ సెట్‌ 2025 కీ విడుదల

ఏపీ ఈఏపీ సెట్‌ 2025 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. బుధవారం ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు సంబంధించిన కీ విడుదల చేస్తారు.

జేఎన్టీయూకే కాకినాడ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీ సెట్‌ 2025 మంగళ వారంతో ముగిసినట్టు ఈఏపీ సెట్ ఛైర్మన్, జేఎన్టీయూ వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తోలినాకె, ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి మొత్తం దరఖాస్తు చేసిన వారిలో 2,64,840 (94.38%) మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, పార్మసీ విభాగాల్లో 92శాతం మంది హాజరు అయ్యారు.

ఈఏపీ సెట్‌ 20225 ఇంజనీరింగ్‌ పరీక్షకు మొత్తం 2,80,611 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,64,840మంది పరీక్షలకు హాజరయ్యారు. 94.38శాతం మంది హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో అన్ని సెషన్లకు కలిపి 81,837మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 75,460మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలల్లో 92.21 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు.

నేడు ఇంజనీరింగ్ పరీక్షల ప్రాథమిక కీ విడుదల

మే 19 నుంచి 27వ తేదీ వరకు ఏపీ, హైదరాబాద్ లోని 145 కేంద్రాల్లో ఈఏపీ సెట్ నిర్వహించారు. ఏపీఈ ఏపీసెట్ ప్రశాంతంగా ముగిసిందని సెట్ చైర్మన్, జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు.

ఈ ఏడాది ఇంజనీరింగ్ పరీక్షలకు 94.38 శాతం హాజరు నమోదైంది. అగ్రికల్చర్, పార్మసీకి అన్ని సెషన్లకు 92.21 శాతం మంది పరీక్షలు రాశారు. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రాథమిక కీ మంగళవారం విడుదల చేశారు. విద్యా ర్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు సెట్ చైర్మన్ వివరించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షల ప్రాథమిక కీపై ఈ నెల 29వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చని వివరించారు.

ఇంజనీరింగ్ పరీ క్షల ప్రాథమిక కీని బుధవారం ఉదయం విడుదల చేయనున్నారు. ఈ కీపై అభ్యంతరాలను ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5గంటలలోపు తెలియచేయాలని వీసీ సూచించారు.

మార్కులు అప్‌లోడ్ చేయాలి…

ఈఏపీ సెట్‌లో 25శాతం వెయిటేజీని ఇంటర్ మార్కుల ఆధారంగా తీసుకోనున్న నేపథ్యంలో ఐసీఎస్ఈ, సీబీఎస్‌ఈ, ఏపీవోఎస్ఎస్, ఎన్ఐవోఎస్, డిప్లొమా ఇతర బోర్డులకు చెందిన విద్యార్థులు మార్కులను ఈఏపీసెట్ వెబ్‌సైట్‌లో ఈ నెల 30వ తేదీలోపు తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌-ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీఈఏపీ సెట్‌)-2025 కోసం గడువు ముగిసేసరికి 3,58,017 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఇంజనీరింగ్‌ విభాగానికి 2,77,507 మంది, అగ్రికల్చర్‌-ఫార్మశీ విభాగంలో 79,610 మంది దరఖాస్తు చేశారన్నారు. ఈ రెండు విభాగాలకు 900 మంది దరఖాస్తు చేశారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం